మూతపడ్డ ద్వారకా ఆలయం- అదాని పోర్ట్‌లో కార్యకలాపాలు నిలిపివేత..!!

అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మహోగ్రంగా మారింది. అంతకంతకూ బలపడుతోంది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ ధాటికి తీర ప్రాంతాలు గజగజ వణికిపోతోన్నాయి. దీని తీవ్రత అంచనాలకు మించి ఉండొచ్చంటూ వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది.

గురువారం సాయంత్రం జఖావ్ పోర్ట్ వద్ద తీరాన్ని దాటనుంది ఈ బిపర్‌జాయ్ తుఫాన్. దీని ప్రభావం వల్ల ఇప్పటికే పలు జిల్లాల్లో అతి భారీ వర్షలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. 135-145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తోన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో ఈదురుగాలుల వేగం 160 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది.

Dwaraka temple closed as Cyclone Biparjoy to cross Saurashtra and Kutch today

సౌరాష్ట్ర- కఛ్ జిల్లాల మధ్య ఈ సాయంత్రం తుఫాన్ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. కఛ్ జిల్లాలోని జఖావ్ పోర్ట్ సమీపంలో తీరాన్ని తాకుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్ సమీపిస్తోన్న కొద్దీ దేవభూమి ద్వారకా నగరం, జఖావ్, పోర్బందర్, మాండ్వి, జామ్‌నగర్, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, మోర్బీ, వల్సాద్ వంటి నగరాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీరం పోటెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి.

తీర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. మత్స్యకార గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేశారు. హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ప్రభుత్వం తీర ప్రాంతాల నుంచి 55,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేసింది. నౌకా దళాన్ని సన్నద్ధ పరిచింది.

అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగడానికి వైమానిక దళ హెలికాప్టర్లను సైతం సిద్ధంగా ఉంచింది గుజరాత్ ప్రభుత్వం. వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో ముందస్తు చర్యల కోసం జవాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దేవభూమి ద్వారకలోని ద్వారకాధీశుడి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు భక్తులకు అనుమతించబోమని వెల్లడించారు.

అటు గుజరాత్ తీరంలో ఉన్న ఓడరేవులన్నీ ఇదివరకే మూత పడ్డాయి. కాండ్లా, జఖావ్‌తో పాటు గౌతమ్ అదానీకి చెందిన ముంద్రా, ట్యూనా పోర్ట్‌లల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పిపావావ్, బేడి, నవ్‌లాఖి, పోర్బందర్, ఓఖా, భావ్‌నగర్, సిక్కా పోర్టలన్నీ మూత పడ్డాయి. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఆయా పోర్ట్‌లల్లో ఎగుమతి-దిగుమతి కార్యకాలాపాలన్నింటినీ నిలిపివేసినట్లు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+