ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే అవి తప్పనిసరి: వారికి మినహాయింపు
Ooty Kodaikanal: వేసవి సెలవుల్లో హిల్ స్టేషన్లకు పరుగులు పెడుతుంటారు జనం. దీనికి- ఎండ తీవ్రత ఒక కారణమైతే- పిల్లలకు సెలవులు రావడం మరో కారణం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో గల పర్యాటక ప్రాంతాలకు భారీగా తరళి వెళ్తుంటారు. సమ్మర్ సీజన్‌లో ప్రత్యేకించి- ఊటీ, కొడైకెనాల్‌కు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.
ఊటీ, కొడైకెనాల్, నీలగిరి హిల్ స్టేషన్లను వెళ్లాలనుకునే వారిపై ప్రత్యేక ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇకపై వారంతా ఇ-పాస్‌లను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇ-పాస్‌లను తప్పనిసరి చేసింది మద్రాస్ హైకోర్టు. ఫలితంగా- నేటి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఊటీ, కొడైకెనాల్, నీలగిరిలకు వచ్చే ప్రతి వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, డేటాను సేకరించాలంటూ జస్టిస్ ఎన్ సతీష్ కుమార్, జస్టిస్ డీ భరత చక్రవర్తితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలను నీలగిరి, దిండిగల్ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
ఈ మేరకు నేటి నుంచి దీన్ని అమలు చేయడానికి ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇ-పాస్‌లపై ఎలాంటి పరిమితి విధించట్లేదు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ ఇ-పాస్ లభిస్తుంది. వాహనం రకం, అందులో ఉండే ప్రయాణికుల సంఖ్య, వారు ఎన్నిరోజుల పాటు ఊటీ, కొడైకెనాల్, నీలగిరిల్లో ఉంటారు.. వంటి వివరాలన్నింటినీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ మూడు హిల్ స్టేషన్లకు ప్రతి రోజూ 20 వేలకు పైగా వాహనాలు వస్తుంటాయి. అందులో కార్లు- 11,500, వ్యాన్లు- 1,300, బస్సులు- 600, టూ వీలర్లు- 6,500 ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. కళ్లార్, కుంజపనై, నడుగని, కక్కనల్లా, థాలూర, ఛోళడి, గెడ్డై, పట్టావయల్ చెక్‌పోస్టుల మీదుగా ఆయా టూరిస్టు వాహనాలన్నీ రాకపోకలు సాగిస్తున్నాయంటూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు నివేదించింది.
ఇంతమంది ఊటీ, కూనూరు, కోటగిరి, గూడలూరు, నెల్లివలం వంటి హిల్ స్టేషన్లకు వస్తోంటే అక్కడ సౌకర్యాలను ఎలా కల్పిస్తున్నారు? ఎలిఫెంట్ జోన్ అయినందున ఏనుగుల సంచారానికి ఇబ్బందులు తలెత్తడం వంటి అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ఇ-పాస్ ఉత్తర్వులను జారీ చేసింది.
https://www.tnesevai.tn.gov.in/ అనే వెబ్ సైట్ నుంచి సందర్శకులు ఇ-పాస్‌ను తీసుకోవచ్చు. కాగా- స్థానికులకు ఈ ఇ-పాస్ తీసుకోవడం నుంచి మినహాయింపును ఇచ్చారు. టీఎన్ 43 నంబర్ రిజిస్ట్రేషన్ గల వాహనాలన్నింటికీ ఇ- పాస్ నుంచి మినహాయింపును ఇచ్చినట్లు నీలగిరి జిల్లా కలెక్టర్ ఎం అరుణ తెలిపారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications