వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ముఖ్యమంత్రులకు లేఖ, ముందస్తు ఎన్నికలకు మోడీ మొగ్గు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్దికి విఘాతం కలగకుంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ విషయాన్ని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రకటించారు. మెజారిటీ ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు.

రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు కూడ ఎన్నికలను జరపాలనే అభిప్రాయంతో బిజెపి ఉందనే ప్రచారం సాగుతోంది.

Early Lok Sabha polls may be a reality: BJP CMs to push for ‘One Nation, One Election’

కాంగ్రెస్ పార్టీ కూడ ముందస్తు ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించింది.ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ యంత్రాంగానికి ఆదేశించారు.

బిజెపికి చెందిన పది మంది రాజ్యసభ సభ్యులతో కూడిన కమిటీ సమావేశం తర్వాత బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అయితే ముందస్తు ఎన్నికలకు తాము కూడ సిద్దంగానే ఉన్నామని ఎన్నికల సంఘం కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
The concept of One Nation One Poll may become a reality as all the BJP Chief Ministers are likely to propose the same. The issue would be taken up at a meeting of the BJP on February 28 where the proposal to hold simultaneous polls would be made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X