అస్సాంలో మళ్లీ భూకంపం -వణికిన తేజ్‌పూర్ -వారం వ్యవధిలో ఏడుసార్లు ప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరుస భూకంపాలు కలవరం పుట్టిస్తున్నాయి. గడిచిన నెలరోజులుగా పలు మార్లు ప్రకంపనలు చోటుచేసుకోగా, గడిచిన వారం వ్యవధిలోనే ఏడుసార్లు భూమి కంపించింది. తాజా ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్పిన వివరాలివి..
అస్సాంలోని తేజ్ పూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం మరోసారి భూకంపం సంభవించింది. తేజ్‌పూర్ సిటీకి దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది. 27 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు.

గత సోమవారం(ఈ నెల 3న) కూడా అస్సాంలోని సోనిత్‌పూర్‌లో భూప్రకంనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. గడిచిన వారం వ్యవధిలో అస్సాంలో వరుసగా 7 సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా,
వరుస భూకంపాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ అస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. ఈశాన్య భారతంలో తరుచు ఇలాంటి ప్రకంపనలు రావడం సహజమని, ప్రజలు ఎవరు ఆందోళనకు గురికావల్సిని పనిలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications