పాకిస్తాన్ లో భూకంపం.. వణికిపోయిన జనం; బాబా వంగా చెప్పిందే నిజం!

భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత్ చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రకృతి కూడా తోడయ్యింది. భారతదేశంపై డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్లో నిన్న అర్ధరాత్రి ఆకస్మిక భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై నాలుగు గా నమోదయిందని అధికారులు చెబుతున్నారు.

పాకిస్తాన్ లో భూకంపం
ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంట 44 నిమిషాలకు పాకిస్తాన్లో భూప్రకంపనలు సంభవించాయని, భూకంపం కారణంగా ప్రజలలో భయాందోళనలు కనిపించాయని అయితే ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరిగినట్టు వార్తలు లేవని తెలుస్తోంది. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరానికి సమీపంలో భూప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది.

Earthquake in Pakistan pakistanis in fear True words of Baba Vanga

Take a Poll

భయాందోళనలకు గురవుతున్న పాకిస్తానీలు
పాకిస్తాన్ పైన భారత్ దాడులు కొనసాగుతున్న వేళ అక్కడ భూకంపం చోటు చేసుకోవడం స్థానికులకు మరింత ఆందోళన కలిగిస్తుంది. పాకిస్తాన్ లో భూకంపం రావడంతో చాలా ప్రాంతాలలోని ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. ఇక తాజా పరిణామాలు బల్గేరియన్ జ్యోతిష్య శాస్త్రవేత్త బాబా వంగ చెప్పినట్టు జరుగుతుండడం గమనార్హం.

దారుణంగా పాకిస్తాన్ లో పరిస్థితులు
భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఓటమిపాలు అవుతుందని, ప్రకృతి విపత్తులు కూడా సంభవించి యూరోపియన్ దేశాలకు నష్టం వాటిల్లుతుందని బాబా వంగ వెల్లడించారు. ప్రస్తుతం ఆ మాటలను నిజం చేస్తూ పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భూకంపాలు కూడా చోటు చేసుకోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌ను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఉదయం అమృత్‌సర్‌లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న డ్రోన్‌లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద 26 ప్రదేశాలలో డ్రోన్ దాడులను భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. నిన్న రాత్రి పాకిస్తాన్ జమ్మూ సెక్టార్‌లోని బిఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ కాల్పులు జరిపిందని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) తెలిపింది. ప్రస్తుతం ఇంకా ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+