భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారంనాడు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అదికారులు ప్రకటించారు.
ఇంఫాల్:మణిపూర్ లో శుక్రవారం నాడు భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది.ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
మణిపూర్ రాష్ట్రంలోని సింగ్న్ నా ఘాట్ పరిసర ప్రాంతంలో భూకంపం సంభవించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలు చెందారు.

ఈ భూకంపం సాయంత్రం ఐదున్నర గంటలకు వచ్చిందని అధికారులు చెప్పారు. భారత వాతావరణ శాఖ ఈ మేరకు తన వెబ్ సైట్ లో భూకంపానికి సంబందించిన విషయాన్ని దృవీకరించింది.
అయితే భూకంపానికి సంబందించిన పూర్తి సమాచారం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు.అయితే నష్టం గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications