జమ్మూలో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. జమ్మూలోని చాలా పట్టణాల్లో ఈ ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అటు భారత వాతావరణ శాఖ కూడా దీనిపై స్పందించింది. భూమి లోపలి పొరల్లో 10కి.మీ మేర ప్రకంపనలు వచ్చినట్టు నిర్దారించింది.













Click it and Unblock the Notifications