లడఖ్‌లో 4.2 తీవ్రతతో భూకంపం: ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు
న్యూఢిల్లీ: ఆదివారం లడఖ్‌లో రిక్టార్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. అయితే, ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2:53 గంటలకు భూకంప కేంద్రం ఉత్తర అక్షాంశం 36.02 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 77.33 డిగ్రీలు 30 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు నివాసాలు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కూడా భూకంపం వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఏప్రిల్ 22, శుక్రవారం నాడు కూడా లడఖ్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఏప్రిల్ 18న జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
"భూకంపం తీవ్రత:3.4, 18-04-2022న సంభవించింది, 12:09:59 IST, లాట్: 33.41 & పొడవు: 76.42, లోతు: 10 కి.మీ., స్థానం: కిష్త్వార్, జమ్మూ కాశ్మీర్, ఇండియా," అని నేషనల్ సెంటర్ ఫర్ సీజమ్యాలజీ ఏప్రిల్ 18న ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications
