వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకంపం: 4.3 తీవ్రతతో ప్రకంపనాలు..

|
Google Oneindia TeluguNews

ఇటీవల వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో భూమి కంపించింది. జామ్‌నగర్‌లో 4.3 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి. భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ఆస్తి నష్టం ఏమీ సంభవించలేదు.

భూ ప్రకంపనాలతో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు కూడా తెలియరాలేదు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు వివరాలు తెలియజేయాల్సి ఉంది. జామ్‌నగర్‌లో రాత్రి 7.13 గంటలకు భూమి కంపించిందని అధికారులు వివరించారు. గురువారం ఉదయం జమ్ముకశ్మీర్‌లో భూకంపం వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదయ్యింది.

Earthquake of magnitude 4.3 strikes Gujarat

భూమిలో అకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి వల్ల ఉద్భవించు ప్రకంపనాలనే భూకంపం అంటారు. భూకంపాలను సీస్మోమీటర్‌తో కొలుస్తారు. దీనినే సీస్మోగ్రాఫ్ అని కూడా పిలుస్తారు. భూకంపము యొక్క తీవ్రతను తెలియచేయు సాంకేతికము రిక్టర్ స్కేల్. తీవ్రత కొలిచే సమయంలో 3 అంతకన్నా తక్కువ అయినపుడు అది సాధారణము అని నిపుణులు చెబుతున్నారు. తీవ్రత 7 అయిన సమయంలో పెద్ద విస్తీర్ణములలో ప్రమాదములకు కారణమం ఆగును.

భూకంపములు వచ్చినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భములలో భూమి విచ్ఛిన్నం అవుతుంది. ఒక పెద్ద భూప్రకంపనం యొక్క భూకంప కేంద్రం సముద్రములో సంభవించినపుడు సముద్ర గర్బము విచ్ఛిన్నమయినందు వలన సునామీ వస్తోంది. భూకంపము వలన వచ్చు కదలికలు రాళ్ళు , మట్టి దొర్లిపడుటకు కారణం వల్ల కొన్ని సందర్భాలలో అగ్నిపర్వతం మాదిరిగా రూపాంతరము చెందును.

భూకంపం అంటే సహజంగా గమనించబడిన ప్రకంనలు అయిన అయివుండవచ్చు.. భుకంపనలకు కారణాలు పలు రకాలు ఉంటాయి. రాళ్ళు బీటలు వారడం వల్ల, అగ్నిపర్వత చర్యల వల్ల, పెద్ద పెద్ద బండలు జారి పడటం వల్ల, గనులను పేల్చడం వల్ల , న్యూక్లియర్ ప్రయోగాల వల్ల.. భూకంపానికి కారణమైన మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అని పిలుస్తారు. భూమి ఉపరితలమునకు దగ్గరగా జరిగిన విచిన్నాన్నే ఎపిసెంటర్ లేదంటే భూకంపకేంద్రము అంటారు

English summary
Tremors were felt in Gujarat's Jamnagar after an earthquake of magnitude 4.3 struck the city on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X