రాహుల్ ఆరోపణలతో ఈసీ అలర్ట్-4 రాష్ట్రాల ఓటర్ వెబ్ సైట్ల డౌన్..!
కర్నాటక, మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా భారీగా ఓట్ల చోరీ జరిగిందని, దీనికి ఈసీయే కారణమంటూ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. రాహుల్ ఆరోపణలతో ఇన్నాళ్లూ స్వతంత్ర సంస్థగా చెప్పుకుంటున్న ఈసీ ఆత్మరక్షణలో పడిపోయింది. రాహుల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తుండగానే కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు ఆయనకు సవాళ్లు విసరడం ప్రారంభించారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రమాణం చేసి అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కర్నాటక, మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు ట్వీట్లు చేయడంతో పాటు రాహుల్ కు లేఖలు పంపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని తేల్చేసింది. దీంతో రాహుల్ తదుపరి ప్లాన్ ఏంటో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ఎన్నికల కమిషన్ వర్గాలు తదుపరి చర్యలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో ఇవాళ ఉదయం నుంచీ మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల వెబ్ సైట్లు పనిచేయడం మానేశాయి. ఆయా వెబ్ సైట్ల నుంచి కూడా రాహుల్ గాంధీ ఎన్నికల డేటా తీసుకుని బయటపెడతారన్న భయంతోనే ఇలా వెబ్ సైట్లు మూసేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈసీ మాత్రం వీటిపై వివరణ ఇచ్చేందుకు సిద్దంగా లేదు. దీంతో కాంగ్రెస్ నేతల అనుమానాలు బలపడేలా ఉన్నాయి.
ECI’s transparency exercise has begun !
— Randeep Singh Surjewala (@rssurjewala) August 8, 2025
e - voter page of Maharashtra , Bihar , Madhya Pradesh and Rajasthan are down since this morning ! pic.twitter.com/MMJGNK6NSU
ఈసీ నిష్పాక్షికత ప్రదర్శన ప్రారంభమైందంటూ కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా ఇవాళ వ్యంగంగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలు చేయగానే... మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ-ఓటర్ పేజీలు డౌన్ అయిపోయాయంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా రాహుల్ గాంధీ ఆరోపణల వీడియోల్ని ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈసీ రాహుల్ గాంధీ ఆరోపణలకు జవాబు చెప్పాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications