సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?

బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ కారు చెక్ చేసిన పోలీసులు .. తాజాగా బెంగళూరులో సీఎం కుమారస్వామి వాహనాన్ని తనిఖీ చేపట్టడం చర్చానీయాంశమైంది. దీంతో ఎన్నికల వేళ తాము కఠినంగా ఉంటున్నామని ఈసీ చెబుతోండగా, అధికార ఎన్డీఏ ఆడించినట్టు ఈసీ ఆడుతోందని .. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఆల్ ఆర్ ఈక్వల్

ఆల్ ఆర్ ఈక్వల్

కర్ణాటక సీఎం కుమారస్వామి వాహనాన్ని గురువారం ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేపట్టారు. బెంగళూరు-హసన్ రహదారిపై చన్నరయపట్న చెక్ పోస్ట్ వద్ద కుమారస్వామి కారును ఆపి చెక్ చేశారు. ఎన్నికల సమయంలో సాధారణంగా జరిగే తనిఖీలేనని ఈసీ అధికారులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, నేతల వాహనాల తనిఖీలను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆపి తనిఖీ చేస్తామని ఈసీ అధికారి ఎన్ఎస్ దర్శన్ పేర్కొన్నారు. కారు ఆపి డిక్కి చెక్ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో పంపించివేశామని తెలిపారు.

ప్రజ్వల్ వాహనం కూడా ..

ప్రజ్వల్ వాహనం కూడా ..

కుమారస్వామి రేంజ్ రోవర్ వాహనంతోపాటు హసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ గౌడ్ కార్లను కూడా ఈసీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల తనిఖీల తర్వాత తమ వాహనాల ఏమైనా లభించాయా అని అధికారులను కుమారస్వామి ప్రశ్నించారు.

గెలుపు అనివార్యం ..?

గెలుపు అనివార్యం ..?

హసన్ నుంచి విజయం జేడీఎస్ అనివార్యమైంది. ఇక్కడినుంచి పోటీచేస్తున్న ప్రజ్వల్ గౌడ .. జేడీఎస్ అధినేత దేవేగౌడ మనమడు. సీఎం కుమారస్వామి రేవణ్ణ సోదరుడి కుమారుడి. హసన్ నియోజకవర్గంలో జేడీఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. మనమడి కోసం దేవేగౌడ తుమ్‌కూరు నుంచి పోటీచేస్తున్నారు. ఈ క్రమంలో నగదు తరలిస్తున్నారనే అనుమానంతో ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మాండ్యాలో నిఖిల్‌కు గట్టి పోటీ

మాండ్యాలో నిఖిల్‌కు గట్టి పోటీ

కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ .. మాండ్య లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఆయన ప్రత్యర్థిగా దివంగత అంబరీష్ భార్య సుమలత పోటీలో ఉన్నారు. మాండ్య నుంచి కూడా నిఖిల్‌కు గట్టి పోటీ ఎదురవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+