బీజేపీ మతప్రసంగంగాలు, కాంగ్రెస్ రాజ్యాంగ వ్యాఖ్యలపై ఈసీ షాకింగ్..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు మతపరమైన ప్రసంగాలతో రెచ్చిపోతుంటే, కాంగ్రెస్ రాజ్యాంగం పేరుతో విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈసీ ఇవాళ స్పందించింది. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరికీ చురకలు అంటిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు తమ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీ నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చింది. వీటికి స్పందించి ఆయా పార్టీలు తమ స్పందన తెలిపాయి. దీనిపై ఇవాళ స్పందించిన ఈసీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను మతపరమైన ప్రసంగాలు చేయవద్దని ఆదేశించింది. అలాగే విపక్ష కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చని చెప్పడం మానుకోవాలని ఆదేశించింది.

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ, ఖర్గేలపై అధికార పార్టీ ఫిర్యాదులు చేయడంతో ఏప్రిల్ 25న బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఈసీ నోటీసులు పంపింది. అయితే ఈసీ తమ నోటీసుల్లో ప్రధాని మోడీ పేరును కానీ రాహుల్ గాందీ పేరును కానీ ఎక్కడా పేర్కొనలేదు. కేవలం స్టార్ క్యాంపెయినర్లుగానే పేర్కొంటూ ఈ నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళిని వీరు ఉల్లంఘించకుండా చూడాలని తమ ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.
రెండు పార్టీల అధ్యక్షులకు ఇచ్చిన ఆదేశాలలో, గతంలో తమ నోటీసులకు వారి స్పందన ఆమోదయోగ్యం కాదని ఈసీ పేర్కొంది. దీనికి కారణం రెండు పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను సమర్ధించుకోవడమే. ఏప్రిల్ 25న నోటీసులు ఇచ్చి తర్వాత ఎన్ని కోడ్ ఉల్లంఘనలపై ఇరు పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను ఈసీ తాజా ఆదేశాల్లో గుర్తుచేసింది. ఇప్పటికీ వారి స్టార్ క్యాంపెయినర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోలేదని తెలిపింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications