Bihar Polls: డిప్యూటీ సీఎంపై దాడి-కఠిన చర్యలకు ఈసీ ఆదేశాలు..!
బీహార్ లో ఇవాళ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో లఖీసరాయ్ జిల్లాలో జరిగిన డిప్యూటీ సీఎం విజయ్ సిన్వా కాన్వాయ్ పై దాడి తీవ్ర కలకలం రేపింది. చెప్పులు, రాళ్లు, పేడతో ఆయన కాన్వాయ్ పై ఆర్జేడీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వారు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తీవ్రంగా స్పందించారు. అనంతరం ఈసీ కూడా సీరియస్ అయింది.
లఖీసరాయ్ జిల్లాలో డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్ధి కూడా అయిన విజయ్ సిన్హా కాన్వాయ్ పై జరిగిన దాడిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనపై స్పందించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. శాంతిభద్రతలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించబోమని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత డీఐజీ రాకేష్ కుమార్ ఖురియారి గ్రామాన్ని సందర్శించి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఈ సంఘటన గురించి అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించినప్పుడు కొంతమంది స్థానికులు నిరసన తెలిపారని, ఆయన వాహనంపై బురద, ఆవు పేడ ఉన్నట్లు గమనించానని తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తారన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.

ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతూ.. ముంగేర్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని డీఐజీ తెలిపారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఏ బూత్ నుండి ఎటువంటి అవాంతరాలు సంభవించలేదని వెల్లడించారు. ఎక్కడా ఓటింగ్ ప్రభావితం కాలేదన్నారు. ముంగేర్ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. బీహార్ ఎన్నికల మొదటి దశలో ఓటు వేయడానికి ముందు విజయ్ సిన్హా జగదాంబ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications