ప్రధాని ‘మన్ కీ బాత్’ని నిషేధించలేం, కానీ: ఈసీ
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని నిషేధించడం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి నెల మోడీ రేడియో ద్వారా 'మన్ కీ బాత్' పేరుతో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.
నెల నెల జరిగే ఈ కార్యక్రమాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని, కానీ మోడీ ఈ మన్ కీ బాత్‌లో ఎన్నికలకు సంబంధించి మాట్లాడకూడదని, బీహార్ ఎన్నికలకు సంబంధించి ప్రజలపై ప్రభావం చూపే వ్యాఖ్యలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది.
మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నవంబర్ 8 వరకూ నిషేధించాలని కాంగ్రెస్ పార్టీతోపాటు మహాకూటమి నేతలు ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ప్రధాని ప్రభుత్వ సంస్థలను ప్రచారం కోసం ఉపయోగిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మహా కూటమి నేతలు ఆరోపించారు. అయితే దీన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
కాగా, మోడీ మన్ కీ బాత్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేయడం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీపై మండుతున్నారు. ఇది సరైన చర్య కాదని అంటున్నారు. మోడీ ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్‌లో తన ఆలోచనలు, ఇతర అంశాలు వివరిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications