వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎంసీపై ఈసీ భగ్గు: లేఖ తప్పుల తడక అంటూ నిప్పులు

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య ఎన్నికల రగడ నెలకొంది. నిన్న నందిగ్రాం‌లో జరిగిన తొక్కిసలాట పెను వివాదం రేపింది. మమత కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే దీనిపై టీఎంసీ ఈసీకి లేఖ రాయగా.. ప్రతీగా బీజేపీ కూడా లెటర్ రాసింది. అయితే ఎన్నికల సంఘం స్పందించింది. టీఎంసీ తీరును తప్పుపట్టింది.

లేఖలో అన్నీ తప్పులతో ఉంది అని ఈసీ అభిప్రాయపడింది. ఇదీ రాజ్యాంగం యొక్క పునాదిని మరింత బలహీన పరుస్తోందని పేర్కొన్నది. లేఖలో రాసిన పదాలు దురదృష్టకరం అని తెలిపింది. ఎన్నికల నిర్వహించే పేరుతో శాంతిభద్రతలు, యంత్రగాన్ని కమిషన్ స్వాధీనం చేసుకుందని టీఎంసీ పేర్కొన్నది. ఇదీ ముమ్మాటికీ తప్పు అని ఈసీ తెలియజేసింది.

 EC slams TMC, says its letter is full of insinuations

ఇరు పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకుంటూ లేఖ‌లు పంపించారు. మమతని హ‌త్య చేయ‌డానికి జ‌రిగిన కుట్ర ఇది అని తృణ‌మూల్ ఆరోపించ‌గా.. అవ‌న్నీ అబద్ధాల‌ని, ఆ ఫుటేజీ చూపించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ డీజీపీని తొల‌గించిన 24 గంట‌ల్లోపే సీఎంపై హ‌త్యాయ‌త్నం చేశార‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ త‌న లేఖ‌లో ఆరోపించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే ఎన్నిక‌ల సంఘం డీజీపీని తొల‌గించింద‌ని టీఎంసీ చెబుతోంది. డీజీపీని తొల‌గించ‌డం, ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ పోలీసులు లేక‌పోవ‌డంపై తృణ‌మూల్ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతోంది. కొంద‌రు సంఘ విద్రోహ శ‌క్తుల‌ను నందిగ్రామ్‌కు త‌ర‌లించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆ పార్టీ తెలిపింది.

ఈ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఖండించింది. సీఎం భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యంలో ఆరోప‌ణ‌లు ఏంట‌ని ప్రశ్నిస్తోంది. సీఎం ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా సిబ్బంది, వేలాది మంది పోలీసులు ఉన్నా ఇది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించింది. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు ఆ స‌మ‌యంలోని వీడియో ఫుటేజీని బ‌య‌ట‌పెడితే అస‌లు సంగ‌తేంటో తెలుస్తుంద‌ని పేర్కొంది.

English summary
Election Commission said it's "unfortunate" that the letter written by the Trinamool Congress is "full of insinuations and averments".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X