Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉప రాష్ట్రపతిగా మోదీ ఛాయిస్ కూడా ఆయనే?- రేపో మాపో..!!

Vice President of India: ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి, వైద్యుల సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం వెంటనే తన రాజీనామా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ధన్ ఖర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమమైంది. 74 సంవత్సరాల ధన్‌ఖర్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది.

EC starts preparations Vice Presidential Elections 2025

రాజ్యసభ ఛైర్మన్‌ కూడా అయిన ధన్‌ఖర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఆ పార్టీ ప్రతిపాదించే నాయకుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు అవుతారనే చర్చ ఊపందుకుంటోంది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ తెరపైకి వచ్చింది. ఆయనను తదుపరి ఉప రాష్ట్రపతిగా నియమించాలనే డిమాండ్లు ఊపందుకుంటోన్నాయి.. ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో.

నితీష్ కుమార్ గత 20 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం కలిగి ఉండటం, కేంద్ర, రాష్ట్ర రాజకీయాలలో ఆయన పాత్రను పరిగణనలోకి తీసుకుని నితీష్ కుమార్ పేరును బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ బచౌల్ ప్రతిపాదించారు. ఈ పదవికి నితీష్ కుమార్ అన్ని విధాలా సమర్థుడని అన్నారు.

అటు కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 24 లేదా 26 తేదీల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్టు చివరి నాటికి దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ధన్‌ఖర్ రాజీనామా సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందింది. దీనితో వెంటనే ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952 ప్రకారం, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణలు, పోలింగ్, లెక్కింపుతో సహా మొత్తం ప్రక్రియను గరిష్టంగా 32 రోజుల్లో పూర్తి చేయాలి. దీని ప్రకారం, తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు నెలాఖరులోగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తారు. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేపట్టారు కూడా. మంగళవారం సాయంత్రం సీనియర్ మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు.

కొందరు బీజేపీ ఎంపీలతోనూ ఆయన విడివిడిగా సమావేశం అయ్యారు. నితీష్ కుమార్ పేరు కూడా తెర మీదికి వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిహార్ కు చెందిన బీజేపీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులతోనూ మోదీ భేటీ అయ్యారని సమాచారం. వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+