ప్రధాని మోడీ చాపర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు వేసిన ఈసీ
Recommended Video
ఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, బంగారం వంటవి పట్టుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లో భాగంగా ఉన్న మరికొందరు అధికారులు నిబంధనలను మరిచి తనిఖీలు చేసి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే బుధవారం ఒడిషాలో చోటుచేసుకుంది.

తనిఖీలు చేశారు...వేటు వేశారు
ఒడిషాలో ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి మొహ్మద్ మోహిసిన్‌ను నియమించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మోహిసిన్.... తన విధుల్లో భాగంగా ఏకంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను సంబల్‌పూర్‌లో తనిఖీ చేశాడు. దీంతో లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు. ప్రధాని హెలికాఫ్టర్ చెక్‌చేయడంతో మోహిసిన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

తనిఖీల నుంచి ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి మినహాయింపు
ప్రధాని నరేంద్ర మోడీ వీవీఐపీ కేటగిరీలోకి వస్తారు. ఆయనకు ఎస్పీజీ రక్షణ ఉంటుంది. ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్నవారు తనిఖీలనుంచి మినహాయింపు ఇస్తోంది ఎన్నికల సంఘం. మరి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి మొహ్మద్ మోహిసిన్ తెలిసి తనిఖీలు చేశాడో లేదా ప్రధాని ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్న వ్యక్తి అని మరిచి చేశాడో తెలియదు కానీ మొత్తానికీ ఆయన హెలికాఫ్టర్ తనిఖీ చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఓ ట్రంకు పెట్టెను మరో వాహనంలో పెడుతున్న వీడియో
ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను తనిఖీలు చేయడంతో ఆయన 15 నిమిషాలు పాటు వేచిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను కూడా రౌర్ కేలాలో చెక్ చేశారు. ఎన్నికల సిబ్బంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాపర్‌ను కూడా సంబల్ పూర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. కొద్ది రోజుల ముందు ప్రధాని చాపర్‌లో ఏదో నల్ల ట్రంకు పెట్టెను దించి మరో వాహనంలోకి ఎక్కిస్తున్న వీడియో బయటపడింది. దీంతో ప్రతిపక్షాలు ప్రధాని తన చాపర్‌లో డబ్బులు తరలిస్తున్నారని తీవ్రఆరోపణలు చేశాయి. ఆ తర్వాత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలికాఫ్టర్‌ను కూడా తనిఖీలు చేసిన దృశ్యాలు బయటపడ్డాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications