Economic survey 2022-23:ఈ ఆర్థిక సంవత్సరంకు వృద్ధి రేటు అంచనా ఎంత..?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో 2021-22కి సంబంధించిన ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను లోక్‌సభలో ప్రవేశపెడతారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి 9శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఎకనామిక్ సర్వేను సిద్ధం చేసినట్లు సమాచారం. గతేడాది కోవిడ్-19 సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11శాతంగా వృద్ధి రేటును నిర్ధేశిస్తూ నిర్మలాసీతారామన్ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టారు. అది ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తుంది.
గతేడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పలు కీలక అంశాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సప్లయ్‌తో పాటు సంస్కరణలు, నిబంధనలను సరళతరం చేయడం, మౌలికరంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం, ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడం, తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ ఏడాది ఆర్థిక సర్వే ఎలా ఉంటుందా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎకనమిక్ సర్వేకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం:













Click it and Unblock the Notifications