ఆర్దికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత - దేశ ఆర్దిక వ్యవహారాల్లో కీలకంగా..!!
ప్రముఖ ఆర్దికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూసారు. ఆయన వయసు 72. గుండెపోటుతో అభిజిత్ సేన్ మరణించినట్లు ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ వెల్లడించారు. సోమవారం రాత్రి 11 గంటలు దాటిని తరువాత అభిజిత్ కు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకొనేలోగానే అభిజిత్ ప్రాణాలు కోల్పోయారు.
ఆర్దిక వేత్తగా..ప్రణాళికా సంఘం సభ్యుడుగా అభిజిత్ సేన్ వ్యవహరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అభిజిత్ కు మంచి పట్టు ఉంది. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్గా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2004-2014 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారు. వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధానంగా వ్యవసాయ రంగం పైన పెట్టుబడులు..సంస్కరణల దిశగా అనేక సూచనలు చేసారు.

ధరల స్థిరీకరణ పైన ప్రభుత్వ నిర్ణయంలో కీలకంగా పని చేసారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో అభిజిత్ సేన్ దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రాన్ని బోధించారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ చైర్మన్‌తో పాటు పలు పదవుల్లోనూ పని చేశారు.












Click it and Unblock the Notifications