చెన్నై నవవధువు ఫ్యామిలీ సజీవదహనం: టెక్కీ జీవితం నాశనం, పఠాన్ కోట్ నుంచి వచ్చి !
మహాబలిపురం సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్)లో చెన్నైకి చెందిన ఆడిటర్ కుటుంబ సభ్యుల సజీవదహనం కేసు దర్యాప్తు చేస్తున్న ఆదికారులు షాక్ కు గురైనారు.
చెన్నై: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్)లో చెన్నైకి చెందిన ఆడిటర్ కుటుంబ సభ్యుల సజీవదహనం కేసు దర్యాప్తు చేస్తున్న ఆదికారులు షాక్ కు గురైనారు. ఆడిటర్ ఫ్యామిలీ సజీవదహనానికి అసలు కారణం తెలుసుకుని హడలిపోయారు.
చెన్నైలో ఆడిటర్ గా పని చేస్తున్న జయదేవన్ (50) కుటుంబ సభ్యుల సజీవదహనం కేసు విచారణలో ఒక్కోక్క విషయం బయటకు వస్తోంది. వారు చనిపోవడానికి అసలు విషయాలు బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఆడిటర్ దంపతులు !
చెన్నైలో ఆడిటర్ గా పని చేసే జయదేవన్ కు మంచి పలుకుబడి ఉంది. ఆయన భార్య రమాదేవి చిట్లపాక్కంలోని ప్రైవేట్ స్రూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. జయదేవన్, రమాదేవి దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారని వారి బంధువులు అంటున్నారు.

ఎకైక కుమార్తె దివ్యశ్రీ
జయదేవన్, రమాదేవి దంపతుల ఎకైక కుమార్తె దివ్యశ్రీ (24). చిన్నప్పటి నుంచి దివ్యశ్రీని ఎంతో అల్లారుమద్దుగా పెంచారని సమాచారం. దివ్యశ్రీ మాట అంటే జయదవేన్, రమాదేవి దంపతులకు వేదవాక్కు అని వెలుగు చూసింది.

ఇటీవల పెళ్లి చేశారు !
ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసిన టెక్కీ దివ్యశ్రీకి శరత్ అనే వ్యక్తితో కొన్ని నెలల క్రితం ఘనంగా వివాహం జరిపించారు. శరత్ పఠాన్ కోట్ లో ఆర్మీ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. దివ్యశ్రీ, శరత్ ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారని సమాచారం.

కుమార్తెను వెంట తీసుకు వచ్చారు !
కొంతకాలం అనోన్యంగా ఉన్న శరత్, దివ్యశ్రీల కాపురంలో ఇటీవల కొన్ని మనస్పర్థలు వచ్చాయని సమాచారం. కొన్ని రోజుల క్రితం జయదేవన్ పఠాన్ కోట్ వెళ్లి కుమార్తె దివ్యశ్రీ, అల్లుడు శరత్ తో మాట్లాడారు. అక్కడ ఏమి జరిగిందో ఏమో ? జయదేవన్ తన వెంట కుమార్తె దివ్యశ్రీని పిలుచుకుని చెన్నై చేరుకున్నాడు.

పరస్పరం కేసులు నమోదు !
కుమార్తె దివ్యశ్రీని పిలుచుకుని చెన్నై చేరుకున్న ఆడిటర్ జయదేవన్ తన అల్లుడు శరత్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరత్ కుటుంబ సభ్యులు సైతం దివ్యశ్రీ, ఆమె కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరం ఇరు వర్గాలు ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకున్నారు.

జీవితంపై విరక్తి !
ఎంతో అన్యోన్యంగా పెంచుకున్న తమ కుమార్తె దివ్యశ్రీ జీవితం ఇలా అయ్యిందే అంటూ జయదేవన్, రమాదేవి దంపతులు జీవితంపై విరక్తి పెంచుకున్నారని సమాచారం. మహాబలిపురం సమీపంలోని మనమై గ్రామం దగ్గర ఉన్న స్థలాన్ని చూడటానికి జయదేవన్, రమాదేవి, దివ్యశ్రీ కారులో వెళ్లారు.

దివ్యశ్రీ కాపురం విషయంలో!
మనమై గ్రామం దగ్గర జయదేవన్, రమాదేవి, దివ్యశ్రీలు ముగ్గురు చర్చించుకున్నారు. ఎంతో గొప్పగా బ్రతికిన మనల్ని దివ్యశ్రీ కాపురం విషయంలో ఇరుగుపొరుగు వారు చులకనగా చూస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

రోడ్డు పక్కన కారు పార్క్ చేసి !
మనమై గ్రామం సమీపంలోని ఈసీఆర్ రోడ్డు పక్కన కారు పార్క్ చేసిన జయదేవన్ కుటుంబ సభ్యులు ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్యాన్ లో వెంట తీసుకు వెళ్లిన పెట్రోల్ మీద పోసుకుని కారు డోర్ లాక్ చేసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ప్రత్యక్ష సాక్షులు అదే చెప్పారు !
రోడ్డు పక్కన కారు నిలిపి రెండు మూడు నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. అయితే కుమార్తె కాపురం విషయంలో ఆడిటర్ జయదేవన్ రాజీ చెయ్యడానికి ప్రయత్నించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఓ పోలీసు అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో వెలుగు చూడటంతో వారి బంధువులు విషాదంలో మునిగిపోయారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications