మమత మా డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు..! సుప్రీంకోర్టులో ఈడీ షాకింగ్..!

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఏడాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న కన్సల్టెన్సీ ఐప్యాక్ ఆఫీసులో తాజాగా ఈడీ దాడులు నిర్వహించడం, వాటిని నిరసిస్తూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి అడ్డుకోవడం జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో ఇరువర్గాలూ పిటిషన్లు దాఖలు చేసినా విచారణ మాత్రం జరగలేదు. దీంతో ఇప్పుడు వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కోల్ కతాలోని ఐ ప్యాక్ ఆఫీసులో తమ తనిఖీల్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అధికార యంత్రాంగం సాయంతో స్వయంగా అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇది తమ విధుల్ని అడ్డుకోవడమేనని, ఆర్టికల్ 32 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా కోరింది. దీనిపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంలో తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

ED Alleges Mamata Took Incriminating Documents from Custody Bengal Govt Files Counter

హైకోర్టులోనూ దాదాపు ఇలాంటి విజ్ఞప్తులే చేసినా విచారణ జరిగి తీర్పు రాకపోవడంతో ఈడీ ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణ మధ్యలో ఉండగానే కోర్టు హాల్లోకి భారీ ఎత్తున లాయర్లు, తృణమూల్ నేతలు చొచ్చుకొచ్చారు. కేసుకు సంబంధం లేని వాళ్లను బయటికి పంపాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చినా వారు మాత్రం బయటికి వెళ్లలేదు. దీంతో విచారణ వాయిదా వేసి జడ్జి వెళ్లిపోయారు.

ED Alleges Mamata Took Incriminating Documents from Custody Bengal Govt Files Counter

తృణమూల్ నేత జైన్ ఇంట్లో జరిగిన దాడిలో ముఖ్యమంత్రి మమత తమ కస్టడీ నుండి నేరారోపణ పత్రాలను తీసుకెళ్లారని ఈడీ సుప్రీంకోర్టులో ఆరోపించింది. దీనిపై స్పందిస్తూ మమత.. ఈడీ తనను, తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశాలు ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+