వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు స్కాం: నవభారత్ మాజీ డైరెక్టర్ల ఆస్తులు అటాచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ED attach Navabharat assets worth Rs.180 crores
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నవభారత్ మాజీ డైరెక్టర్ల ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. యూపీఏ హయాంలో బొగ్గు కుంభకోణం సంచలనం రేపిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంకు సంబంధించి ఈడిలో బుధవారం విచారణ జరిగింది.

ఈ సందర్భంగా నవభారత్ ప్రమోటర్స్ మాజీ డైరెక్టర్లకు చెందిన 180 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో త్రివిక్రమ్ ప్రసాద్‌కు చెందిన రూ.138.59 కోట్ల వాటాలు, హరిశ్చంద్ర ప్రసాద్‌కు చెందిన రూ.36.32 కోట్ల విద్యుత్ జనరేటర్లు ఉన్నాయి. హైదరాబాదులోని నాదర్‌గుల్‌లోని రూ.11.2 కోట్ల భూములను ఈడీ జప్తు చేసింది.

కాగా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ ఇటీవల అభియోగపత్రం దాఖలైన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు హరిశ్చంద్ర ప్రసాద్, త్రివిక్రమ్ ప్రసాద్‌పై మోసం, కుట్ర అభియోగాలు నమోదు చేసింది.

బొగ్గు బ్లాకుల కేటాయింపుల కోసం నవభారత్ సంస్థ మరికొన్ని కంపెనీలతో కలిసి వాస్తవాలను కప్పిపుచ్చిందని సిబిఐ ఆరోపించింది. నవభారత్‌కు ఒడిషాలో రెండు కోల్ బ్లాక్స్‌ను కేటాయించారు. చార్జిషీట్ దాఖలుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 11వ తేదీన సిబిఐని ఆదేశించింది. సిబిఐ 16 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది.

English summary
ED attach Navabharat assets worth Rs.180 crores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X