బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Businessman: ఫెమా నియమాలు హుష్ కాకి, రూ. కోట్ల ఆస్తులు అటాచ్, మైసూరు బోండా తినిపించిన ఈడీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రముఖ వ్యాపారి ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఈడీ అధికారులు అక్రమాస్తులు సంపాధిస్తున్న వారిపై పంజా విసరడం కలకలం రేపింది. ఎప్పుడు ఏ అధికారులు వచ్చి ఇళ్ల మీద పడతారో అని అక్రమాస్తులు సంపాధించిన వ్యాపారులు హడలిపోతున్నారు.

Kiladi lady: న్యూడ్ వీడియో కాల్, దెబ్బకు సైబర్ క్రైమ్, సీబీఐ, కోట్లు లాగేసిన కిలాడీ లేడి రియా, క్లైమాక్స్ లో ?Kiladi lady: న్యూడ్ వీడియో కాల్, దెబ్బకు సైబర్ క్రైమ్, సీబీఐ, కోట్లు లాగేసిన కిలాడీ లేడి రియా, క్లైమాక్స్ లో ?

మంగళూరులో ప్రముఖ వ్యాపారి

మంగళూరులో ప్రముఖ వ్యాపారి

విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు సిటీకి చెందిన ఓ వ్యాపారికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కారణంగా రూ. 17 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.

ఒక్క దెబ్బతో రూ. 17 కోట్ల ఆస్తి హామ్ ఫట్

ఒక్క దెబ్బతో రూ. 17 కోట్ల ఆస్తి హామ్ ఫట్

మంగళూరులోని ముక్కా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన మోహమ్మద్ హారిస్‌ అలియాస్ మోహమ్మద్ పేరిట ఉన్న రూ.17.34 కోట్ల స్థిరాస్తులను ఈడీ అధికారులు జప్తు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు మోహమ్మద్ హారిస్ మీద కేసు దర్యాప్తు చేసి విచారణ చేశారు.

యూఏఈలో అక్రమాస్తులు

యూఏఈలో అక్రమాస్తులు

ఈడీ అధికారుల ఈ విచారణలో మోహమ్మద్ హారిస్ యూఏఈలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. మోహమ్మద్ హారిస్ కు విదేశాలలో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, విదేశాలలో అతను వ్యాపారాలు చేస్తూ పలు చోట్ల పెట్టుబడులు పెట్టాడని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. విదేశాల్లో, మంగళూరులో పలు వ్యాపారాలు చేస్తున్న ప్రముఖ వ్యాపారి మోహమ్మద్ హారీస్ మీద ఈడీ అధికారులు పంజా విసరడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫెమా చట్టం సెక్షన్ 4 ప్రకారం ?

ఫెమా చట్టం సెక్షన్ 4 ప్రకారం ?


విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించిన మోహమ్మద్ హారిస్ కోట్ల విలువైన ఆస్తులను విదేశాల్లో కూడెబట్టారని అధికారులు గుర్తించారు. . భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం మోహమ్మద్ హారిస్ కు విదేశాల్లో రూ. రూ.17. 34 కోట్ల విలువైన అక్రమ ఆస్తి ఉందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇది ఫెమా చట్టంలోని సెక్షన్ 4 చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అధికారులు అంటున్నారు.

 విదేశాల్లోని ఆస్తులకు సమానంగా ఇక్కడ ఆస్తులు అటాచ్

విదేశాల్లోని ఆస్తులకు సమానంగా ఇక్కడ ఆస్తులు అటాచ్


ఫెమా .

చట్టం ప్రకారం విదేశాలలో అక్రమంగా ఉన్న ఆస్తులకు బదులుగా వారికి చెందిన భారతదేశంలోని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీ అధికారులకు ఉంది. ఈ నియమాల ప్రకారం మంగళూరులోని మోహమ్మద్ హారిస్ కు చెందిన రెండు విలువైన ఫ్లాట్లు, ఒక ఇండస్ట్రియల్ ప్లాట్‌ను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఫెమా చట్టం కింద మోహమ్మద్ హారిస్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఈడీ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

English summary
ED officials give jerk to Mangaluru businessman for violating FEMA Act. Rs.17 crore assets attached by ED officials in Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X