Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్..! 3వేల కోట్ల స్కాం-50 ఆఫీసుల్లో తనిఖీలు..!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. యస్ బ్యాంక్ నుంచి 3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ ఆఫీసులు, ఇతర ప్రాంగణాలపై ఈడీ ఏకకాలంలో దాడులు జరుపుతోంది. ఇందులో భారీ ఎత్తున డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
రూ.3 వేల కోట్ల అన్ సెక్యూర్డ్ రుణాలు పొందేందుకు యస్ బ్యాంక్ ప్రతినిధులతో పాటు బ్యాంక్ ప్రమోటర్లకు భారీగా లంచాలు ఇచ్చినట్లు అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీబీఐ ఇప్పటికే ఆయనపై కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పై మనీలాండరింగ్ సహా పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లోనే ఇవాళ ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి.

ఇవాళ ఈడీ ఏకంగా ఈ స్కాంతో సంబంధం ఉన్న మొత్తం 50కి పైగా సంస్థలు, కార్యాలయాలపై 35 ప్రాంతాల్లో దాడులు జరుపుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా 25 మందికి పైగా వ్యక్తుల్ని కూడా ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.ఈడీ ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేయడానికి ప్రణాళికాబద్ధంగా, ఆలోచనాత్మకంగా రూపొందించిన పథకంగా ఈ స్కాంను అభివర్ణించింది.
STORY | ED raids in bank loan 'fraud' against Anil Ambani group companies, Yes Bank
— Press Trust of India (@PTI_News) July 24, 2025
READ: https://t.co/blDP01qHaC
VIDEO: Visuals from outside Reliance Centre, Mumbai.#MumbaiNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/BumKJ5yWpK
ఈ స్కాంలో భాగంగా రూ.3 వేల రుణం పొందేందుకు అనుమానిత నేరాలలో భారీగా సురక్షితం కాని రుణాలను పొందేందుకు అనిల్ అంబానీ కంపెనీ యెస్ బ్యాంక్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్లతో సహా సీనియర్ బ్యాంక్ అధికారులకు లంచం ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 2017 నుంచి 2019 మధ్య యెస్ బ్యాంక్ రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కింద ఉన్న రాగా కంపెనీలకు సుమారు రూ.3,000 కోట్ల రుణాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రుణాల మంజూరుకు ముందు యస్ బ్యాంక్ ప్రమోటర్లు తమ ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థల్లోకి డబ్బు పొందడం ద్వారా క్విడ్ ప్రోకో కు పాల్పడినట్లు ఈడీ చెబుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications