ఐ ప్యాక్ పై ఈడీ మెరుపు దాడుల వెనుక, టార్గెట్ ఫిక్స్..!!
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూపు ఐ ప్యాక్ పై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. త్వరలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనూ.. ఇప్పుడూ పలు పార్టీలకు ఐ ప్యాక్ రాజకీయ కన్సెల్టెన్సీగా పని చేసింది. నాడు ఏపీలో జగన్ నుంచి నేడు పశ్చిమ బెంగాల్ లో మమతా వరకు ఐ ప్యాక్ సేవలు అందుతున్నాయి. అనేక రాజకీయ పార్టీల సమాచారం ఐ ప్యాక్ వద్ద నిక్షిప్తం అయి ఉంది. కాగా, ఐ ప్యాక్ పై ఈడీ దాడులను బెంగాల్ సీఎం మమతా తప్పు బట్టారు. కాగా, ఈ దాడుల పైన ఇప్పుడు రాజకీయంగా దుమారం మొదలైంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు వెనుక కీలక పాత్ర పోషించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తాజా నిర్ణయం సంచలనంగా మారింది. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఇవాళ(గురువారం) ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా సోదాలు చేస్తోంది.

పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద జరుగుతున్నా యని అధికారులు స్పష్టం చేశారు. ఐప్యాక్‌కు సంబంధించిన నిధుల లావాదేవీలపై అనుమానా లతోనే ఈ దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. అందులో భాగంగా ఐ ప్యాక్ కు పీఎంఎల్‌ఏ పరిధిలోకి వచ్చే నిధులు అందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని లావాదేవీలు, ఫండింగ్ సోర్సులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈడీ అధికారులు అధికారికంగా ఎలాంటి తుది ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
కాగా, రతీక్ జైన్ తృణముల్ కాంగ్రెస్ ఐటీ సెల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అటు ఈడీ దాడులను నిరసిస్తూ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనిఖీలు చేస్తున్నారని మమత మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన హార్డ్‌డిస్క్, అభ్యర్థుల జాబితా, సంస్థాగత డేటాను ఈడీ అధికారులు సీజ్ చేసేందుకు ప్రయత్నిస్ తున్నారని ఆరోపించారు. ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ దాడులను రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆగ్రహం వ్యక్తం చేసారు.
తమ పార్టీకి చెందిన వ్యూహాలను తెలుసుకునేందుకే ఈడీ సోదాలు జరుపుతోందని అన్నారు. బీజేపీ కార్యాలయంపై తాము సోదాలు జరపలేమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు సర్ పేరుతో ఓటరు జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలిగిస్తూ మరోపక్క తమ పార్టీకి చెందిన సమాచారాన్ని దొంగలిస్తున్నారని మమత ఆరోపించారు. బంగాల్‌లో ఐప్యాక్ సంస్థ టీఎంసీకి సేవలందిస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ సంచలనంగా మారుతోంది.












Click it and Unblock the Notifications