కేకేఆర్ షేర్ల విక్రయం: షారుఖ్‌కు ఈడీ సమన్లు

ముంబై: ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టును బాలీవుడ్ నటి జూహి చావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో కలిసి షారుఖ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ జట్టుకు సంబంధించిన కొన్ని షేర్లను 2008లో షారుక్ ఖాన్ మారిషస్‌కు చెందిన ఓ సంస్ధకు విక్రయించాడు. ఈ షేర్ల విక్రయం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మే, 2015న ఈడీ షారుఖ్‌కు సమన్లు జారీ చేసింది.

ED summons Shah Rukh Khan over sale of KKR shares

తాజాగా సోమవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షారుఖ్ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. అయితే తాను ముంబైలో లేనని షారుఖ్ ఈడీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా అతడు ఈడీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+