వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సంక్షోభంలో కీలక పరిణామం: ఉద్ధవ్ వర్గంపై ఈడీ పంజా: సంజయ్ రౌత్‌కు సమన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభం ఇవ్వాళ కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గ నేతలు టార్గెట్ అయ్యారు. మొన్నటికి మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తరహాలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పంజా విసిరారు. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.

 ఉద్ధవ్‌కు కుడిభుజంలా..

ఉద్ధవ్‌కు కుడిభుజంలా..


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్.. కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరేకు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తోన్నారు. అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో కొనసాగుతోన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ నేతలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వస్తోన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్‌నాథ్ షిండేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి జీవం లేకుండా వారు ముంబైకి చేరుకుంటారంటూ విమర్శలు గుప్పించారు.

సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు..

సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు..

ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పట్ర చాల్ భూ కుంభకోణం కేసు విషయంలో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారమే ఆయన ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాకస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గంలో కీలక నేతగా పేరున్న సంజయ్ రౌత్.. ఈడీ నుంచి సమన్లు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 మొన్న రాహుల్ గాంధీ..

మొన్న రాహుల్ గాంధీ..


కొద్దిరోజుల కిందటే ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారించిన విషయం తెలిసిందే. అయిదారు రోజుల పాటు ఈ విచారణ కొనసాగింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఆయన నుంచి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టుకున్నారంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ఆమె కొంత గడువు కోరారు.

 మరిన్ని ఇబ్బందులు తప్పవా?

మరిన్ని ఇబ్బందులు తప్పవా?


కరోనా వైరస్ బారిన పడ్డ సోనియా గాంధీ కొన్ని రోజుల పాటు దేశ రాజధానిలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈడీ అధికారులు జారీ చేసిన సమన్ల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. కాగా- పట్ర చాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్‌ను ఎన్ని రోజుల పాటు విచారిస్తారనేది చర్చనీయాంశమైంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి రావడం వల్ల ఉద్ధవ్ వర్గానికి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

English summary
Enforcement Directorate summons Shiv Sena MP Sanjay Raut on June 28, in connection with Patra Chawl land scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X