పన్నీరు కంటే స్ట్రాంగ్‌గా పళనిస్వామి: సీఎంగా ప్రమాణం, మంత్రులు వీరే..
పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ విద్యాసాగర రావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 31 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కేబినెట్లో 4గురు మహిళలకు చోటు దక్కింది.
చెన్నై: పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర రావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 30 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కేబినెట్లో 4గురు మహిళలకు చోటు దక్కింది. పళని స్వామి జయలలిత కేబినెట్లో నెంబర్ 3గా ఉన్నారు. తమిళనాడుకు 13వ ముఖ్యమంత్రి.
సెంగొట్టోయన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పళనిస్వామి తన వద్ద 19 శాఖలను ఉంచుకున్నారు. హోంశాఖ, ఆర్థికశాఖ వంటి కీలక పోర్టు పోలియోలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. దీంతో ఆయన పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కీలక శాఖలను తన వద్దే ఉంచుకోవడం వల్ల పన్నీరుసెల్వం కంటే స్ట్రాంగ్ సీఎంగా కాబోతున్నారు. పన్నీరు సెల్వం మూడుసార్లు సీఎం అయినప్పటికీ ఆయన పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించలేకపోయారు.

అంతకుముందు, గత తొమ్మిది రోజులుగా కోవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్‌లోనే బసచేసిన ఎమ్మెల్యేలు తొలిసారిగా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు రాజ్‌భవన్‌కు ప్రత్యేక బస్సుల్లో చేరుకున్నారు.
















Click it and Unblock the Notifications