సీఎం పళనిసామి విసిగిపోయారు: సొంతఊరు వెళ్లిపోయారు: ఎందుకంటే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రోజురోజుకూ జరుగుతున్న రాజకీయాలు తట్టుకోలేక విసిగిపోయారో ? ఏమో ? సొంత ఊరికి బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లో పూజలు, హోమాలు, యాగం చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.
సేలం జిల్లాలోని ఎడప్పాడి పళనిసామి సొంత ఊరు. ఎడప్పాడి నియోజక వర్గం నుంచి పళనిసామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రోజు రోజుకూ రాజకీయ ఒత్తిడి ఎక్కువ కావడంతో పళనిసామి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇన్ని రోజులు పన్నీర్ సెల్వం వర్గం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకున్నారు.

అయితే గురువారం ఒక్క సారిగా సొంత గూటిలోని 28 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టడానికి సిద్దం కావడంతో సీఎం ఎడప్పాడి పళనిసామి మరింత ఒత్తిడికి గురైనారు. గత శనివారం ఎడప్పాడిలో సీఎం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
ఆ సందర్బంలో ఢిల్లీ బయలుదేరడానికి సిద్దం అయిన పళనిసామి సొంత ఊరిలో జరుగుతున్న పూజలకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు తనకు ఎలాంటి సమస్యలు ఎదురూకాకుండా నా పదవి ఎలాగైనా కాపాడు దేవుడా అంటూ ప్రత్యేక పూజలు చెయ్యడానికి సొంత ఊరికి బయలుదేరారు.












Click it and Unblock the Notifications