Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రంజాన్ శుభాకాంక్షలు: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ సందేశం

న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం దేశ వ్యాప్తంగా రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Eid 2018: President Kovind, PM Modi extend greetings to nation

'ఈద్‌ ముబారక్‌, ఈ పండుగ రోజున మన సమాజంలోని ఐక్యత, సామరస్యం మరింత పెంపొందాలని ఆశిస్తున్నా' అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. అంతేగాకుండా దేశ ప్రజలకు రమజాన్‌ శుభాకాంక్షలు చెబుతూ.. ఆడియో ఫైల్‌ను షేర్‌ చేశారు.

కాగా, 'ఈద్‌ ముబారక్‌. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను' అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ట్వీట్‌ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రజలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్‌ ముబారక్‌, భగవంతుడు మనందరికి శాంతి, సంతోషం, జ్ఞానం, మంచి ఆరోగ్యం కలిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+