వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రోన్స్, ఎన్‌ఎస్‌జీ కమాండోల మధ్య మోడీ సభ..

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల్లో ఆందోళన కొనసాగుతున్నాయి. దీంతో గత పది రోజులుగా హింసాత్మక సంఘటనలు కూడ చేసుకోవడంతో సుమారు 20 మందివరకు పౌరలు కూడ మృత్యువాతపడిన పరిస్థితి నెలకొంది. దీంతో ఓవైపు నిరసనలు మిన్నంటుతుంటే...మరోవైపు దేశ ప్రధాని నరేంద్రమోడీ మెగా పోలిటికల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యహ్నం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ప్రదర్శన ,బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ప్రధానికి బెదిరింపులు.. భారీ బందోబస్తు..

ప్రధానికి బెదిరింపులు.. భారీ బందోబస్తు..

అయితే మోడీ ర్యాలీకి బెదిరింపులు వచ్చాయి. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ప్రధాని ర్యాలీ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమై ఏర్పాట్లు చేశారు. మోడీ ర్యాలీతో పాటు ఇతర ప్రాంతాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అందోళనలకారులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో భారీ ఏర్పాట్లు చేశారు.

మైదానం చుట్టు 5వేల పోలీసులు

మైదానం చుట్టు 5వేల పోలీసులు

ఇప్పటికే ర్యాలీ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్న పోలీసులు సుమారు అయిదు వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకోసం నేషనల్ సెక్యూరిటీకి చెందిన అధికారులను రంగంలోకి దింపారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ డ్రోన్ బృందాల్ని సైతం మోహారించారు. వీరితో పాటు ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ కలిసి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

సభ ముగిసేవరకు షాపులు బంద్...

సభ ముగిసేవరకు షాపులు బంద్...

బహిరంగ స్థలంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీశీలిస్తున్న పోలీసులు సరైన గుర్తింపు కార్డు ఉన్నవారినే సభ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. మెటల్‌డిటెక్టర్ల ద్వార నాయకులు, ప్రజలను లోనికి అనుమతిస్తున్నారు. రామ్‌లీలా పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను సభ పూర్తయ్యే వరకు మూసివేయనున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఎన్నికల ర్యాలీనా.. అనుకూల ర్యాలీనా..

ఎన్నికల ర్యాలీనా.. అనుకూల ర్యాలీనా..

ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు పార్టీ నాయకత్వం పావులు కదుపుతుంది. దీంతో మెగార్యాలికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సంధర్భంలోనే పౌరసత్వ చట్టం మోడీ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పౌరసత్త చట్టంతోపాటు పలు అంశాలపై మోడీ ఎలాంటీ ప్రకటన చేయబోనున్నారనే ఉత్కంఠ నెలకొంది.

English summary
Prime Minister Narendra Modi will address a rally on Sunday at the large Ramlila Maidan, about this rally An elaborate security arrangement has been made for the rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X