భార్య కింద నలిగి భర్త మృతి, ఆమె కూడా

Subscribe to Oneindia Telugu

రాజ్‌కోట్: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ(68) మెట్లు దిగుతూ కిందపడింది. ఆమె తన భర్తపై పడటంతో అతడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. మెట్లపై నుంచి పడిన ఆమె కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది. అయితె ఆమె 128 కిలోల భారీ ఖాయమే ఈ ఘటనకు కారణమైందని తెలుస్తోంది.

రాంధామ్ సొసైటీలో మంజుల విథ్లానీ, ఆమె భర్త నట్వర్ లాల్, వారి కుమారుడు ఆశీష్, అతని భార్య నిషాలు నివాసం ఉంటున్నారు. మంజుల దంపతులు గ్రౌండ్లో ఫ్లోర్‌లో ఉంటుండగా, వారి కొడుకు, కోడలు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే, సోమవారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఆశీష్‌కు శ్వాసకు సంబంధించిన వ్యాధితో ఇబ్బందికి గురయ్యాడు

Elderly couple dies as husband gets crushed under 128kg wife

గమనించిన ఆశీష్ తల్లి మంజుల అతనికి మందులు తీసుకొచ్చేందుకు మెట్లపై నుంచి కిందికి వచ్చింది. అదే సమయంలో మెట్లపైకి వస్తున్న భర్తపై ఆమె అదుపు తప్పి పడింది. ఇద్దరు మెట్లపై నుంచి దొర్లుకుంటూ కిందపడ్డారు. మంజుల భారీ ఖాయంతో భర్తపై పడటంతో అతడు తీవ్రగాయాలయ్యాయి.

మంజులకు కూడా తీవ్రగాయాలవడంతో .. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. అత్తామామలను పట్టుకునేందుకు వెళ్లిన కోడలు కూడా మెట్లపై నుంచి జారిపడి గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a strange incident, an elderly couple died after the woman slipped from the staircase and fell on her husband in Ramdham Society on the posh Kalavad Road on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి