బెంగళూరులో దంపతుల హత్య, మనుమడే కింగ్ పిన్, రూ. వందల కోట్లు, ఫోలీస్ ఫైరింగ్ !
బెంగళూరు: ఆస్తి వివాదంలో అవ్వా తాతను స్నేహితులతో కలిసి హత్య చేసిన మనుమడు, అతని స్నేహితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ఏఎల్ సమీపంలో నివాసం ఉంటున్న బీఇఎల్ రిటైడ్ ఉద్యోగి గోవిందన్ (65), సరోజ (60) జంట హత్యల కేసులో ఆమె మనుమడు ప్రమోద్, అతని స్నేహితులు ప్రవీణ్, హసన్ పాష అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆస్తి వివాదం ఉంది !
మంగళవారం రాత్రి పోద్దుపోయిన తరువాత గోవిందన్, సరోజ దంపతులు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ఆదివారం మద్యాహ్నాం దంపతులు దారున హత్యకు గురైనారు. కేసు విచారణ చెయ్యడానికి ఏసీపీ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు.

రూ. వందల కోట్ల ఆస్తి !
బెంగళూరు నగర శివార్లలోని వైట్ ఫీల్డ్, వర్తూరు ప్రాంతంలో హత్యకు గురైన గోవిందన్ భార్య సరోజ కుటుంబ సభ్యులకు దాదాపు 50 ఏకరాల భూములు ఉన్నాయి. వాటి విలువ రూ. కొన్ని వందల కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంటున్నారు.

మనుమడి అరెస్టు !
గోవిందన్ భార్య సరోజ, ఆమె సోదరుడికి ఆస్తి వివాదం ఉంది. గోవిందన్, సరోజ దంపతుల మనుమడు ప్రమోద్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ సందర్బంలో ప్రమోద్ స్నేహితులతో కలిసి అవ్వా తాతను హత్య చేశానని అంగీకరించాడు.

పోలీసుల మీద దాడి
ప్రమోద్ ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నహితుడు ప్రవీణ్ ను అరెస్టు చేశారు. మరో నిందితుడు హసన్ పాష యమలూరు ప్రాంతంలో తలదాచుకున్నాడని సమాచారం తెలుసుకున్న పోలసులు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో హసన్ పాషా పోలీసుల మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

రివాల్వర్ తో కాల్పులు !
ఆ సమయంలో సబ్ ఇన్స్ పెక్టర్ ప్రశీలా రివాలర్వ్ తో హసన్ పాష ఎడమకాలి మీద కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. హసన్ పాషను ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నామని ఏసీపీ శివకుమార్ తెలిపారు. పోలీసులు మరో ఇద్దరు నిందితులను విచారణ చేస్తున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications