రాహుల్ డిమాండ్ కు తలొగ్గిన ఈసీ-ఆ రెండు ఎన్నికల డేటా ఇచ్చేందుకు ఓకే..!
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటికి సంబంధించిన డేటాను విడుదల చేయాలని విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాహుల్ డిమాండ్ ను ఇన్నాళ్లూ తోసిపుచ్చుతూ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎట్టకేలకు దిగివచ్చింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల డేటాను పూర్తి స్ధాయిలో ఇచ్చేందుకు సిద్దమని ఇవాళ ప్రకటించింది. దీనిపై రాహుల్ గాంధీ ఈసీకి ధన్యవాదాలు తెలిపారు.
2009 నుంచీ జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల డేటా ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ గతంలో పలుమార్లు ఈసీని కోరారు. అయితే రాహుల్ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ వచ్చిన ఈసీ.. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు ఈ డేటా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే బహిరంగంగా మాత్రం ఏమీ చెప్పలేదు. అయితే ఉన్నట్లుండి ఇవాళ మాత్రం ఈసీ కాంగ్రెస్ పార్టీ అడిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల డేటా ఇచ్చేందుకు సిద్దమని తెలిపింది.

Good first step taken by EC to hand over voter rolls.
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2025
Can the EC please announce the exact date by which this data will be handed over in a digital, machine-readable format? pic.twitter.com/SbW3DrCapK
ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితాను ఇచ్చేందుకు ఈసీ అంగీకరించడాన్ని తొలి మంచి నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అయితే ఈ వివరాలు ఎప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో ఇస్తారో కచ్చితమైన తేదీ వెల్లడించాలని ఈసీ ముందు రాహుల్ గాంధీ మరో డిమాండ్ పెట్టారు. రాహుల్ గాంధీ ఈ పోస్టు పెట్టిన తర్వాత మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓ ట్వీట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అడిగిన డేటా ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల ఓటర్ల జాబితా వివరాలు ఇచ్చినట్లు తెలిపారు.
— ChiefElectoralOffice (@CEO_Maharashtra) June 9, 2025
మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్, మిత్రపక్షాలతో కలిసి కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలు వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత మాత్రం ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆయన షాకయ్యారు. అప్పటి నుంచీ ఈ రెండు ఎన్నికల డేటా కావాలంటూ అడుగుతున్నారు. కానీ దీన్ని ఎప్పటికప్పుడూ నిరాకరిస్తూ వస్తున్న ఈసీ ఎట్టకేలకు అంగీకరించింది.












Click it and Unblock the Notifications