కేజ్రివాల్ విమర్శలకు ఈసీ ఘాటు కౌంటర్-ఢిల్లీ ఎన్నికల వేళ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు ఢిల్లీ పరిధిలోని 70 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తాజాగా తమపై చేసిన విమర్శలకు ఈసీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు వింటోందంటూ ఈసీపైనా, సీఈసీ రాజీవ్ కుమార్ పైనా కేజ్రివాల్ చేసిన విమర్శలకు ఈసీ కౌంటర్ గా ఓ ప్రకటన విడుదల చేసింది.
ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ సమిష్టిగా ఢిల్లీ ఎన్నికలలో ఈసీని కించపరచడానికి పదే పదే చేస్తున్న ఉద్దేశపూర్వక ఒత్తిడి వ్యూహాలను గుర్తించిందని ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపింది. ఇది ఒకే సభ్య సంస్థగా, రాజ్యాంగపరమైన సంయమనం కలిగి ఉండాలని నిర్ణయించుకుందని వెల్లడించింది. అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించకుండా సంయమనం పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది. తద్వారా కేజ్రివాల్ తీరును ఎండగట్టింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని కేజ్రివాల్ గతంలో ఆరోపించారు. అలాగే సీఈసీ రాజీవ్ కుమార్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్న ఆయన గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఆశించి ఇలా చేస్తున్నారంటూ కేజ్రివాల్ చేసిన విమర్శలు పెను సంచలనం రేపాయి. వీటిపై ఇప్పటివరకూ స్పందించకుండా మౌనంగా ఉన్న ఈసీ.. ఎన్నికల పోలింగ్ కు ఒక్క రోజు వ్యూహాత్మకంగా స్పందించింది. అదీ సీఈసీ మాత్రమే కాకుండా ఈసీ పేరు మీదే ప్రకటన విడుదల చేశారు.
The 3-member Commission collectively noted repeated deliberate pressure tactics to malign ECI in Delhi Elections,as if it is a single member body & decided to have constitutional restraint, absorbing such outbursts with sagacity, stoically & not to be swayed by such insinuations
— Election Commission of India (@ECISVEEP) February 4, 2025












Click it and Unblock the Notifications