జ్ఞానేష్ కు ఈసీ క్లిన్ చిట్ ? విపక్షాల పిటిషన్లపై సుప్రీం విచారణ వేళ ట్విస్టులు..!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దశల వారీగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో పలు నిర్ణయాన్ని సీఈసీ జ్ఢానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారని, కమిషన్ లో ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషీ, సుఖ్ బీర్ సింగ్ సంధూను సంప్రదించలేదని గతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో ఓవైపు ఈసీ నిర్ణయాలన్నీ సమష్టిగా తిసుకున్నవే అని ఓవైపు చెప్తుండటం, మరోవైపు కమిషనర్ల మధ్య విభేదాలకు ఆధారాలు బయటపడుతున్న తరుణంలో 12 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఎస్ఐఆర్ పై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్తంగా తీసుకున్న నిర్ణయాల్ని సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు కీలక విచారణకు సిద్దమైంది. దీనిపై ఇప్పటికే సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్.సంధు, వివేక్ జోషిలకు విడివిడిగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎన్నికల కమిషన్ (Election Commission) తరఫు న్యాయవాది మాత్రం ఒకే అఫిడవిట్ ద్వారా స్పందన తెలిపారు. విడివిడిగా నోటీసులు జారీ చేసినప్పటికీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు ఇద్దరు ఈసీలు కూడా స్పందించలేదు.దీంతో రేపు జరిగే సుప్రీంకోర్టు విచారణలో సీఈసీ, ఈసీలు ప్రాతినిధ్యం వహించకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీల న్యాయవాదులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ దశలో ఈసీ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్ లో కీలక విషయాలు ఉన్నాయి.

Election Commission Tells SC SIR Orders Were Unanimous Denies Gyanesh Kumar Acted Alone
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!

ఎస్ఐఆర్ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో ఖండించింది. ఎస్ఐఆరు కు సంబంధించిన మూడు ఉత్తర్వులను ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఏకగ్రీవంగా తీసుకుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఈసీ పనితీరును, ఎస్ఐఆర్ సంబంధిత ఫారాలలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఈ ఆరోపణలు పూర్తిగా ఒకే ఒక్క వార్తా నివేదికపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ అఫిడవిట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారని స్పష్టం చేసింది. అంతర్గత చర్చల సమయంలో సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన సూచనలు, పరిశీలనలు లేదా ప్రశ్నలు కమిషన్ నిర్ణయాలుగా పరిగణించబడవని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తద్వారా సీఈసీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది.

Election Commission Tells SC SIR Orders Were Unanimous Denies Gyanesh Kumar Acted Alone
రఘురామకు సుప్రీంకోర్టు షాక్..! సీబీఐకి కీలక ఆదేశాలు..!
రఘురామకు సుప్రీంకోర్టు షాక్..! సీబీఐకి కీలక ఆదేశాలు..!

అలాగే ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం 6లో మార్పులకు సంబంధించిన వివాదంపై స్పందిస్తూ.. ఫారంలో ఎలాంటి సవరణలు చేయలేదని తెలిపింది. నిర్దేశిత ఫారాన్ని సవరించే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉందని, అయితే ఎస్ఐఆర్ ప్రక్రియకు అవసరమైన డిక్లరేషన్ ఒక ప్రత్యేక పత్రమని పేర్కొంది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడాన్ని దీన్ని ఒక సవరణగా భావించవచ్చని కమిషన్ అంగీకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఫామ్ 6 మార్పులకు తమ ఆమోదం ఉందన్న ఈసీ వాదనతో విభేదించింది. ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+