మోడీపై ప్రియాంక మాటల దాడి: స్కుల్ పిల్లలు కాదని..
రాయ్‌బరేలి: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ తన ఆరోపణల దాడిని కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాయ్ బరేలిలో సోనియా గాంధీ కోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూడా మోడీపై విమర్శల వర్షం కుపించారు. ఓటర్లు స్కూలు పిల్లలు కాదని.. ఏదీ చెప్తే అది నమ్మరని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గుజరాత్‌లో అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న మోడీ.. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ప్రియాంక ప్రశ్నించారు. పేదల భూములు పారిశ్రామిక వేత్తలకు అడ్డగోలుగా కట్టబెట్టారని ఆమె విమర్శించారు. తమ కుటుంబ సభ్యులను ‘ఏబిసిడి', ‘ఆర్ఎస్‌విపి'లుగా పోల్చడంపై ఆమె మండిపడ్డారు.

‘ఏబిసిడి', ‘ఆర్ఎస్‌విపి' అంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించే సమయంలో వాడే పదాలు. ఏబిసిడి అంటే.. ఆదర్శ్ సొసైటీ కుంభకోణం(ఏ), బోఫోర్స్ కుంభకోణం (బి), కోల్‌గేట్ కుంభకోణం (సి).. కాగా, ‘ఆర్ఎస్‌విపి' అంటే.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (ఆర్), సోనియా గాంధీ (ఎస్), ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా (వి), ప్రియాంక గాంధీ(పి)లతోపాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పలు కుంభకోణాలకు పాల్పడ్డారని మోడీ ఆరోపిస్తున్నారు.
మీరు చెప్పాలనుకున్నది చెప్పండి.. అంతేగానీ ‘ఏబిసిడి', ‘ఆర్ఎస్‌విపి' అక్షరాలతో పోల్చుతూ చెప్పాల్సిన అవసరం లేదని మోడీకి ప్రియాంక గాంధీ సూచించారు. ఓటర్లు స్కూల్ పిల్లలు కాదని అన్నారు. విభజన రాజకీయాలకు ఓటు వేయొద్దని, ఒక వ్యక్తికి అధికారం ఇవ్వొద్దని ప్రియాంక ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30 ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాయ్ బరేలి నియోజకవర్గంలో సోనియా గాంధీ కోసం ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications