షాక్ మీద షాక్, 406 నామినేషన్ పత్రాలు ఔట్, వేల సంఖ్యలో లీడర్స్ పోటీ !
బెంగళూరు: కర్ణాటకలో 223 అసెంబ్లీ నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. 224 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కొన్ని వేల మంది నామినేషన్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్, ఆప్, ఎన్సీపీ, కేఆర్ పీ, అన్నాడీఎంకే పార్టీలతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
గురువారం మద్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు వెయ్యడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. నామినేషన్ల గడువు పూర్తి కావడంతో ఆ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు. కర్ణాటకలోని 220 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నాయకులు వేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు.

224 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి వేలాది మంది నామినేషన్లు వేశారు. 220 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 4, 607 మంది పురుషులు, 381 మంది మహిళలులు నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 219 మంది, కాంగ్రెస్ నుంచి 2018 మంది, జేడీఎస్ నుంచి 207, ఆప్ పార్టీ నుంచి 207, బహుజన సమాజ్ వాదీ పార్టీ నుంచి 135 మంది, సీపీఎం నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
మిగిలిన వారు ఇతర పార్టీలు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 220 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని నామినేషన్ పత్రాలు పరిశీలించిన అధికారులు అందులో 406 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. బెంగళూరులోని చామరాజపేట్, యలహంక, యశవంతపురంలోని అభ్యర్థుల నామినేషన్ పత్రాల విషయంలో ప్రత్యర్థ పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నామినేషన్ పత్రాలను అన్ని రకాలుగా పరిశీలన చేసిన అధికారులు చివరికి సమస్యలు పరిష్కరించారు. మిగిలిన నాలుగు నియోజక వర్గాల నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి వేలాది మంది ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ పత్రాలు ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో క్లైమాక్స్ లో ఎంత మంది బరిలో ఉంటారు ? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications