అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్, ఒకేసారి 5,500 బస్సులు మాయం, రెండు రోజులు !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మే 10వ తేదీ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఎన్నికల అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు కర్ణాటకలోని వివిద ప్రాంతాల్లో సంచరిస్తున్న 5,500 బస్సులు మాయం అయ్యాయి.
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రతి నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు విదులు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేశారు.

ఒక ప్రాంతంలో ఉన్న అధికారులు, పోలీసులను మరో ప్రాంతంలో విధులు నిర్వించేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవీఎం యంత్రాలు, ఎన్నికల అధికారులు, పోలీసులు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి పిలుచుకుని వెళ్లి వారిని మళ్లీ స్ట్రాంగ్ రూమ్ లకు పిలుచుకుని రావడానికి ఎన్నికల అధికారులు కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులు వారి ఆదీనంలోకి తీసుకున్నారు.
కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మే 9వ తేదీ, మే 10వ తేదీన మొత్తం 5,500 బస్సులు ఎన్నికల అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల విధులు నిర్వహించడానికి ప్రభుత్వ బస్సులు తీసుకున్నారు. ప్రతిరోజు రోడ్ల మీద వివిద ప్రాంతాల్లోని ప్రయాణికులను తరలిస్తున్న 5,500 బస్సులు ఎన్నికల విధుల కోసం పంపించడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కేఎస్ఆర్ టీసీ బస్సులు 3, 700, బెంగళూరు సిటీలో నిత్యం సంచరించే 1, 868 బస్సులు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, పోలీసులను తరలించడానికి తీసుకున్నారు. కర్ణాటకలో రెండు రోజుల పాటు కేఎస్ఆర్ టీసీకి చెందిన 46 శాతం బస్సులు, బెంగళూరులోని 28 శాతం బీఎంటీసీ బస్సులను రెండు రోజులు ఎన్నికల విధుల కోసం తీసుకోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications