వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఏనుగు జారిపడుతుంది; సైకిల్ కు పంక్చర్ అవుతుంది; విజయం బీజేపీదే: యోగి ఆదిత్యనాథ్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదవ దశ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో బిజెపి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుజన సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడిన సీఎం.. పేదల రేషన్‌ తినేవారి కోసం తమ వద్ద బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

Recommended Video

UP Elections 2022 Phase 5 Updates : Ayodhya పాలిటిక్స్ .. హోరాహోరీ పోరు | Oneindia Telugu

ఏనుగు జారి పడి పోతుందని, సైకిల్‌కి సులువుగా పంక్చర్ అవుతుంది అని పేర్కొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ ని, బహుజన్ సమాజ్ పార్టీ ని టార్గెట్ చేశారు. పేదల రేషన్‌ తిన్న వారికి బుల్‌డోజర్‌లు పెట్టాం అని వెల్లడించారు. బుల్‌డోజర్‌ పవర్‌ అంటే అది యూపీ నిర్మాణానికి మరియు అక్రమ మాఫియాలను, అవినీతిని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

 Elephant slips in UP; Punctures the bicycle; Victory to BJP: Yogi Adityanath

మేము 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి వచ్చినప్పుడు, ఈ కుటుంబ పాలకులలో చాలా మంది అయోధ్యలో రామభక్తులతో 'కరసేవ' అందిస్తున్నట్లు కనిపిస్తారు అని ఆయన అన్నారు. రామభక్తులపై కాల్పులు జరిపిన వారు ఇప్పుడు హనుమంతుని గదతో తిరుగుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్య అయోధ్యలో 1990లో నగరం వైపు కవాతు చేస్తున్న 'కర సేవకుల'పై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనను గుర్తుచేస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల, యాదవ్ ఎన్నికల ర్యాలీలో మద్దతుదారులు ఇచ్చిన గదను భుజాన పెట్టుకోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు యోగి ఆదిత్యనాథ్.

రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఎస్పీ టార్గెట్ చేసిన ఆయన రాష్ట్రంలో ఉన్న రేషన్ అంతా ఏనుగు తినేసింది అని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి కూడా వారిని ఆదరించబోరు అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యూపీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి.ఫిబ్రవరి 27న ఐదో దశ ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

English summary
Elephant slips in UP and UP people Punctures the bicycle, Yogi Adityanath targeted BSP and SP saying victory to bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X