డబ్బులిచ్చి రాహుల్ సభకు జనాన్ని తెచ్చారు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులు ఒకరిపై విమర్శించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా సరే బీజేపీ దక్కించుకోవాలని చూస్తుండటం, సర్వేలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి.
గురువారం మధ్యాహ్నాం బీజేపీకి చెందిన నాయకులు ఓటర్లకు బీజేపీ అభ్యర్ధులు డబ్బులు, మద్యం, మాంసాహారం పంచిపెడుతున్నారనీ, వారిని ప్రలోభపెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేదవాళ్ల ఓటరు గుర్తింపు కార్డులను తమ ఆధీనంలోకి తీసుకుందని ఆప్ పార్టీ నేత అశుతోష్ ఆరోపించిన విషయం తెలిసిందే.

గురువారం సాయంత్రం తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. గురువారం సమయ్‌పూర్ బడ్లీ ప్రాంతంలో రాహల్ గాంధీ ర్యాలీకి పెద్ద ఎత్తువ వచ్చిన జనానికి కాంగ్రెస్ పార్టీ నేతలు రూ. 300 నుంచి 500 వరకు డబ్బులు పంచి పెట్టారని ఆప్ నేత నీరజ్ కుమార్ ఆరోపించారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ని ఎన్నికల కమిషన్‌ను సమర్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని అన్నారు. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీలు మధ్యే హోరా హోరీగా ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్ధానంలో ఉంది.












Click it and Unblock the Notifications