వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయంలోనూ ఉగ్రవాదుల కుట్ర -కాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ -అల్ బదర్ ముష్కరులు హతం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా విలవిల్లాడుతోంటే, పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ లోనూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతోంటే, ఇదే అదనుగా టెర్రరిస్టులు కొత్త నియామకాలు చేపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలూ అంతే చాకచక్యంతో వారిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

వ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు -ఆక్సిజన్, పగటి కర్ఫ్యూపైనావ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు -ఆక్సిజన్, పగటి కర్ఫ్యూపైనా

జమ్మూకాశ్మీరులో షోపియాన్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు చిక్కుకొని హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. షోపియాన్ జిల్లా కనిగాం ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి గాలిస్తుండగా అల్ బదర్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

Encounter in Jammu and Kashmirs Shopian, 4 Al-Badr terrorists trapped

పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోద్బలంతో(1998)లో ఏర్పాటైన అల్ బదర్ ఉగ్రవాద సంస్థ తాజా కరోనా పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని కొత్త రిక్రూటీలను నియమించుకుంది. అలా అల్ బదర్ సంస్థలో కొత్తగా చేరిన నలుగురు ఉగ్రవాదులే ఇవాళ్టి ఎన్ కౌంటర్ లో చిక్కారని పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు కొనసాగుతుందని, తదుపరి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. బారాముల్లా జిల్లా సోపోర్ నాథిపోరా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటరులో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.

viral video:కుప్పకూలిన మెట్రో రైల్ -బ్రిడ్జి విరిగి రోడ్డుపై పడ్డ బోగీలు -20మంది దుర్మరణంviral video:కుప్పకూలిన మెట్రో రైల్ -బ్రిడ్జి విరిగి రోడ్డుపై పడ్డ బోగీలు -20మంది దుర్మరణం

Recommended Video

Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Oneindia Telugu

జమ్మూకాశ్మీర్ లో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 4,716 కొత్త కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 1.96లక్షల కేసులు, 2,510 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలుగా ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ సెర్చ ఆపరేషన్లు కుదించడాన్ని అవకాశాంగా తీసుకుని టెర్రరిస్టులు కొత్త నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాల గాలింపును పెంచారు.

English summary
An encounter has started between terrorists and security forces here at the Kanigam area of Shopian district of South Kashmir, Jammu and Kashmir Police said on Thursday. According to police, four newly recruited local terrorists of Al-Badr terror outfit are trapped in the Kanigam area. "Exercising maximum restraint, police and security forces are trying their best to persuade them to surrender," the J-K Police said. On May 4, police neutralized two Lashkar-e-Taiba (LeT) terrorists in an encounter at Nathipora area of Sopore in north Kashmir's Baramulla district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X