జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది అబూజరార్ హతం
జమ్మూకాశ్మీర్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది అబూ జరార్ ను భద్రతా దళాలు అంతమొందించారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పాకిస్థానీ అగ్రశ్రేణి ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అతడికి సహకరించిన మరో ఉగ్రవాదిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎన్ కౌంటర్ .. టాప్ టెర్రరిస్ట్ హతం
బెహ్రామ్‌గాలా ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట నిఘా సమాచారం అందడంతో భారత భద్రతా దళాలు మరియు పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారని భారత భద్రతా దళ అధికారి వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని, దీంతో ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడని పేర్కొన్నారు. మరొక ఉగ్రవాది తప్పించుకున్నాడని అతని కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు.

మోస్ట్ వాంటెడ్ పాకిస్థాన్ టెర్రరిస్టు అబూ జరార్‌ను హతమార్చిన భద్రతా బలగాలు
పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ పాకిస్థాన్ టెర్రరిస్టు అబూ జరార్‌ను హతమార్చినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. అతని వద్ద AK- 47, నాలుగు మ్యాగజైన్‌లు (నిండినవి), ఒక గ్రెనేడ్ మరియు కొంత భారతీయ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఉగ్రవాదికి పాక్ సహకరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడడం తో పాటుగా, టాప్ లష్కరే తోయిబా ఉగ్రవాది రాజౌరీ పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నాడని సమాచారం

దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో అబూ జరార్
పాక్-శిక్షణ పొందిన మరియు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది అబూ జరార్ ఈ సంవత్సరం ఆగస్టులో మొదటిసారిగా కనిపించాడని, దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే పాక్ ప్రయత్నాల్లో అతడు బహుశా భాగమేనని సైన్యం పేర్కొంది. గత కొన్ని నెలలుగా దట్టమైన అడవిలో ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఆహారం, దుస్తులు మరియు కమ్యూనికేషన్ (మొబైల్) కోసం ఉగ్రవాదులు జనాల్లోకి వచ్చిన క్రమంలో భారతీయ సైన్యం , జమ్మూకాశ్మీర్ పోలీసులతో కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నంలో, ఈ మొబైల్ కమ్యూనికేషన్‌ను దాదాపు రియల్ టైం ప్రాతిపదికన పర్యవేక్షించింది.

ఈ ఏడాది హతమైన ఎనిమిదో టాప్ ఉగ్రవాది అబూ జరార్, అంతకు ముందు గైడ్ హాజీ ఆరిఫ్
అయితే అనుమానితుల కదలికలపై స్థానికులు కీలకమైన సమాచారాన్ని అందించారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడం కోసం భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలు రాజౌరి, పూంచ్ ప్రాంతంలో స్థానికుల తిరుగులేని మద్దతు కారణంగా సానుకూల ఫలితాలను చూపుతూనే ఉన్నాయని ఆర్మీ అధికారి తెలిపారు. ఈ ఏడాది హతమైన ఎనిమిదో ఉగ్రవాది అబూ జరార్ అని తెలిపారు. ఇటీవలే రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై భయంకరమైన టెర్రరిస్టు గైడ్ హాజీ ఆరిఫ్ కూడా హతమయ్యాడని పేర్కొన్నారు.

గతంలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది నదీమ్ అబ్రార్ హతం
అంతకు ముందు పాకిస్తాన్ జాతీయుడు, లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది నదీమ్ అబ్రార్ ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, నగరంలోని పరింపొరా ప్రాంతంలో ఆయుధాలు దాచిన ఒక ఇంటి గురించి చెప్పగా, అక్కడకు తీసుకువెళ్ళిన క్రమంలో, అక్కడ దాగి ఉన్న మరో ఉగ్రవాది దాడులకు తెగబడ్డారు అని ఈ క్రమంలో పోలీసులకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తోయిబా ప్రధాన కమాండర్ నదీమ్ అబ్రార్ కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాద కదలికలు ఎక్కువ కావటంతో భారత భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఉగ్ర మూకను ఏరివెయ్యటానికి నిత్యం ఆపరేషన్లు కొనసాగిస్తుంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications