ఎన్‌కౌంటర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి వీర మరణం పొందగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరవీరుడిని సెకండ్ పారా(స్పెషల్ ఫోరెన్స్) రెజిమెంట్ కు చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్‌గా గుర్తించారు.

ఇటీవల ఇద్దరు విలేజ్​ డిఫెన్స్​ గార్డు(వీడీజీ)లను చంపిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్​ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కేశ్వాన్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీకి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఇద్దరు వీడీజీల మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి.

Encounter in JK Army officer killed three jawans injured in firing by terrorists

ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకోగానే భద్రతా దళాలు భార్త్​ రిడ్జ్​ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయని వైట్​ నైట్​ కార్ప్స్​ ఎక్స్‌​లో వెల్లడంచింది. ఇదే ఉగ్రవాదుల గ్రూప్ ఇటీవల ఇద్దరు గ్రామస్థుల(వీడీజీ) అపహరించి చంపేసిందని పేర్కొంది.

కాల్పులు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ సహా మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని వారిని వెంటనే ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది. అనంతరం అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారిందని తెలిపింది. వారిలో రాకేశ్ కుమార్ పరిస్థితి మిషమించి ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

'వైట్​ నైట్​ కార్ప్స్​ జనరల్​ కమాండింగ్ ఆఫీసర్- జీఓసీ సహా అన్ని ర్యాంకుల అధికారులు సెకండ్ పారా(స్పెషల్ ఫోర్సెస్) నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్​ చేస్తున్నారు. కిష్ట్వార్‌లోని భార్త్ రిడ్జ్‌​లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్​ నాయిబ్ సుబేదార్ భాగం. ఈ బాధాకరమైన సమయంలో అమరవీరుడి కుటుంబంతో మేము ఉన్నాం." అని ఆర్మీ ఎక్స్ వేదికగా పేర్కొంది. కాగా, జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉగ్రవాదులు వరుసగా కాల్పుల ఘటనలకు పాల్పడుతున్నారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+