బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Firing: ఎన్ కౌంటర్ జస్ట్ మిస్, వద్దురానాయానా అంటే వినలేదు, ఇప్పుడు చూడు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రెండు వర్గాలకు చెందిన రౌడీషీటర్లు గ్యాంగ్ వార్ మొదలైయ్యింది. ఏరియాలో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు రెచ్చిపోయాయి. ఓ రౌడీషీటర్ ను ప్రత్యర్థి వర్గంలోని రౌడీషీటర్, అతని అనుచరులు దారుణంగా చంపేశారు. హంతకులను పోలీసులు పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో పరిశీలించడానికి వెళ్లిన సమయంలో పోలీసుల మీద వేటకొడవలితో దాడి జరిగింది. వద్దురా నాయనా లొంగిపో అని పోలీసులు చెప్పినా ఆ రౌడీషీటర్ మాట వినలేదని తెలిసింది. పోలీసులు కాల్పులు జరపడంతో తుటాలు రౌడీషీటర్ మీదకు దూసుకుపోయి కుప్పకూలిపోయాడు.

Terrorist: కుక్కర్ బాంబుకు దుబాయ్ ఆలీ డైరెక్షన్, ఏకే-47 కోసం లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను?Terrorist: కుక్కర్ బాంబుకు దుబాయ్ ఆలీ డైరెక్షన్, ఏకే-47 కోసం లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను?

 రౌడీషీటర్ ను నరికేశారు

రౌడీషీటర్ ను నరికేశారు

బెంగళూరు ఉత్తర తాలుకాలోని దాసరహళ్లి సమీపంలోని మాచోనహళ్లిలో ఈనెల 15వ తేదీన రౌడీషీటర్ నటరాజ్ అలియాస్ ముళ్లు దారుణ హత్యకు గురైనాడు. నటరాజ్ ను అతని ప్రత్యర్థి వర్గంలోని మరో రౌడీషీటర్ రాజరాజన్ అలియాస్ సేఠ్, కుమార్ తదితరులు హత్య చేశారని పోలీసులకు తెలిసింది.

 రెండు రోజుల ముందే చిక్కిపోయారు

రెండు రోజుల ముందే చిక్కిపోయారు

రెండు రోజుల క్రితం రాజరాజన్, కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, వేటకొడవళ్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసులు అనుకున్నారు. శనివారం వేకువ జామున నరాజన్ హత్యకు గురైన ప్రాంతానికి రౌడీషీటర్ రాజరాజన్, కుమార్ ను పిలుచుకుని వెళ్లాడు. హత్యకు ఉపయోగించిన వేటకొడవలిని రాజరాజన్ బయటకు తీశాడు.

 ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

ఆ సందర్బంలో అదే వేటకొడవలితో పోలీసుల మీద దాడి చేసి తప్పించుకున్నాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ హాజిమలంగ్ ఇనామదర్ చేతికి గాయాలైనాయి, ఇన్స్ పెక్టర్ మంజునాథ్ గాల్లో కాల్పులు జరిపి లొంగిపోవాలని చెప్పాడు. అయినా రాజరాజన్ పారిపోవడంతో అతకి కాలి మీద కాల్పులు జరపడంతో అతను కుప్పకూలిపోయాడు. బుల్లెట్ గాయాలైన రౌడీషీటర్ రాజరాజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇన్స్ పెక్టర్ మంజునాథ్ మీడియాకు చెప్పారు.

English summary
Encounter: Murder case accused arrested for who attack on police in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X