నాగాలాండ్‌లో దాడి: ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతం, ఆర్మీ జవాన్ కూడా
నాగాలాండులోని మన్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లను నిలువరించే క్రమంలో ఓ సైనిక అధికారి ప్రాణాలు కోల్పోయారు.
నాగాలాండ్: నాగాలాండులోని మన్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లను నిలువరించే క్రమంలో ఓ సైనిక అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో స్థానికుడు మృతి చెందారు.
ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన మిలిటెంట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (యూఎల్‌ఎఫ్ఏ)కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.

తొలుత ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు ఉఘ్రదాడిని సమర్థవంతగా తిప్పికొట్టారు. దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారనే విషయం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications