• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజస్తాన్ సంక్షోభం : తమాషా బంద్ చేయండి... మోదీపై అశోక్ గెహ్లాట్ ఫైర్...

|

తమాషాలు బంద్ చేయాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీని హెచ్చరించారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీని నిందిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా మరోసారి ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను క్షమిస్తే... వారిని తిరిగి పార్టీలోకి స్వాగతిస్తామన్నారు. జైసల్మీర్‌లో తన మద్దతుదారులైన 100 మంది ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టులో శనివారం(అగస్టు 1) ఆయన మాట్లాడారు.

ఏందీ డ్రామా... గెహ్లాట్ ఫైర్...

ఏందీ డ్రామా... గెహ్లాట్ ఫైర్...

'మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి. దేశ ప్రజలు ఆయనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రజలను చప్పట్లు కొట్టించారు,ప్లేట్లు మోగించేలా చేశారు... మొత్తానికి ప్రజలను నమ్మించారు.. అదో పెద్ద కథ. కానీ ఇప్పటికైనా రాజస్తాన్‌లో తమాషాకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు వాళ్లు ఎమ్మెల్యేల బేరసారాలకు దిగుతున్నారు. ఏందీ డ్రామా..' అంటూ గెహ్లాట్ ఫైర్ అయ్యారు.మెజారిటీపై తాను నమ్మకంగా ఉన్నానని... అది 21 రోజుల తర్వాతైనా,31 రోజుల తర్వాతైనా... ఎప్పుడైనా సరే ప్రభుత్వ బలాన్ని నిరూపించేందుకు సిద్దమని గెహ్లాట్ పేర్కొన్నారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న సచిన్ క్యాంప్...

ప్రకంపనలు సృష్టిస్తున్న సచిన్ క్యాంప్...

మరోవైపు సచిన్ పైలట్ మాట్లాడుతూ... తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని,ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ఈ నంబర్ చాలని పేర్కొన్నారు. గెహ్లాట్ క్యాంపుకు చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని నాలుగు రోజుల క్రితం పైలట్ ప్రకంపనలు సృష్టించారు. రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన హేమరాం చౌదరి మాట్లాడుతూ... ఒకవేళ అశోక్ గెహ్లాట్ తన ఎమ్మెల్యేలను నియంత్రించడం మానేస్తే.. అప్పుడు నిజంగా ఆయనవైపు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. ఒక్కసారి వాళ్లను స్వేచ్చగా విడిచిపెడితే ఆయన బలమేంటో తెలుస్తుందన్నారు.

  Mahesh Babu Praises Tamil Film 'Oh My Kadavule' | తెలుగు రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే..!!
  రిసార్టులో ఎమ్మెల్యేలు...

  రిసార్టులో ఎమ్మెల్యేలు...

  అగస్టు 14న అసెంబ్లీ సమావేశాలకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీజేపీ గాలానికి చిక్కకుండా ఉండేందుకు గెహ్లాట్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వం ప్రస్తుతం స్వల్ప మెజారిటీని మాత్రమే కలిగి ఉంది. 200 మంది శాసనసభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో ప్రస్తుతం గెహ్లాట్‌కు 101 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీళ్లలో ఒకరిద్దరు పార్టీ ఫిరాయించిన ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా వాళ్లందరినీ రిసార్టుకు తరలించారు.

  English summary
  Prime Minister Narendra Modi must put an end to the BJP's alleged attempts to topple the Congress-led Rajasthan government, Chief Minister Ashok Gehlot said on Saturday in Jaisalmer, where he has flocked his nearly 100 loyal MLAs in a resort to avert possible inducements from the rival camp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more