భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

కోయంబత్తూరు: హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఓ జినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా మెట్టూరు ప్రాంతానికి చెందిన యువతి కోయంబత్తూర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల నుంచి హాస్టల్‌కి వచ్చిన విద్యార్థిని.. రెండో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్‌ యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Engg college girl student jumps to death from 2nd floor

జవాబు చెప్పలేదని పిల్లాడిని బ్యాటుతో బాదాడు

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కోపంతో 12 ఏళ్ల బాలుడిపై ఓ హాస్టల్ వార్డెన్ ఏకంగా క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ పిల్లాడి తలపై బాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. ఈ ఘటన నవంబర్ 30న పశ్చిమబెంగాల్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రాజర్‌హట్‌‌లో ఉన్న నార్‌ పాయింట్ సీనియర్ సెంకడరీ స్కూల్‌లో జరిగింది.

దీని గురించి బాధిత విద్యార్థి మహమ్మద్ సాహిన్ మొండల్ (12) తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై దాడికి కారణమైన వార్డెన్ దేబ్‌జ్యోతి దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం వల్లే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+