బిగ్ షాక్.. భారత్- అమెరికా మధ్య విమాన సర్వీసులు రద్దు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దిల్లీ, వాషింగ్టన్​ మధ్య నడిచే నాన్​ స్టాప్​ విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. నిర్వాహణపరమైన అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. విమానాల నిర్వాహణ సంబంధిత పరిమితుల కారణంగా ఎయిర్​ ఇండియా బోయింగ్​ 787-8 డ్రీమ్​ లైనర్ విమాన సేవలు​ అందుబాటులో ఉండవని ఎయిర్​ ఇండియా వెల్లడించింది.

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమానాల్లో నెలకొన్న కొరత కారణంగా దిల్లీ, వాషింగ్టన్​ మధ్య నాన్​ స్టాప్​ విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ప్రమాదాల దృష్ట్యా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, అనుభూతిని అందించేందుకు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌ లోని 26 బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమానాలకు రెట్రో ఫిట్టింగ్ పనులను చేపట్టింది. ఈ ఆధునికీకరణ ప్రక్రియ 2026 చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా సంస్థ. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు పాకిస్తాన్ గగనతలం మూసివేత కూడా ఈ నిర్ణయానికి కారణమని ఎయిర్ ఇండియా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు గగనతలం మూసివేశాయి. అయితే పాకిస్థాన్‌ గగనతలంపై భారత విమానాలను మూసివేయడం కారణంగా ఎక్కువ దూరం వెళ్లే విమాన సర్వీసుల కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా అభిప్రాయ పడింది.

English Air India Suspends Delhi-Washington DC Flights from September 1 2025

ఇక సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్​ కు లేదా వాషింగ్టన్ నుంచి దిల్లీకి ఎయిర్ ఇండియా విమానాలను బుక్ చేసుకున్నవాళ్లు తమను సంప్రదించాలని ఎయిర్ ​ఇండియా తెలిపింది. అలాగే న్యూయార్క్, నెవార్క్, చికాగో, శాన్ ఫ్రాన్సి స్కో ఎయిర్ పోర్ట్ ల మీదుగా వాషింగ్టన్​ కు వన్-స్టాప్ విమానాలు కొనసాగుతాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+