మెరీనా బీచ్‌కు పెనుముప్పు: ముంచుకొచ్చిన 'చమురు' ప్రమాదం
బీచ్ పొడవునా నలుపు రంగులో చమురు తెట్లు దర్శనమిస్తున్నాయి. వీటినుంచి వెదజల్లుతోన్న దుర్గంధం బీచ్ కు వచ్చేవారిని ఇబ్బందికి గురిచేస్తోంది.
చెన్నై: నాలుగు రోజుల క్రితం చెన్నై సముద్ర తీరంలో రెండు కార్గో ఓడలు ఢీకొట్టుకోవడంతో.. ఓడల్లోని చమురు సముద్రంలోకి లీక్ అయింది. దీంతో సముద్ర తీర ప్రాంతమంతా కలుషితమైపోయిన పరిస్థితి. చమురు తెట్టలు నీటిపై తేలుతూ తీరప్రాంతానికి కొట్టుకువస్తున్నాయి.
తొలుత ఎన్నూరు తీరంలో ఈ చమురు తెట్టలు దర్శనమియ్యగా.. సోమవారం ఉదయానికి మెరీనా బీచ్ ను తాకాయి. దీంతో బీచ్ పొడవునా నలుపు రంగులో చమురు తెట్లు దర్శనమిస్తున్నాయి. వీటినుంచి వెదజల్లుతోన్న దుర్గంధం బీచ్ కు వచ్చేవారిని ఇబ్బందికి గురిచేస్తోంది.

బీచ్ లోని ఇసుకతెన్నెలపై కూడా చమురు తెట్లు దర్శనమిస్తుండటంతో బీచ్ సందర్శకులు ముక్కులు మూసుకుని నడవాల్సిన పరిస్థితి. మరోవైపు చమురు తెట్టు వల్ల సముద్రంలోని జలచరాలు సైతం చనిపోయే పరిస్థితి నెలకొంది. చమురు తెట్టల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన చేపలు, తాబేళ్లు తీరం ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి.












Click it and Unblock the Notifications